Anasuya Bharadwaj: కొన్నాళ్లుగా అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటే, అనసూయ తిరిగి కౌంటర్లు ఇస్తుంది. లైగర్ మూవీ విడుదల సమయంలో ఒక వివాదం నడిచింది. తాజాగా ఖుషి చిత్ర పోస్టర్లో ది విజయ్ దేవరకొండ అని పెట్టడాన్ని ఆమె తప్పుబట్టారు. పైత్యంగా బాగా పెరిగిందంటూ సెటైర్స్ వేసింది. ఆగ్రహించిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆంటీ అంటూ మరోసారి ట్రోలింగ్ కి తెగబడ్డారు. ఈ వివాదం పీక్స్ వెళ్ళింది.
మీరు ఎంతన్నా ట్రోల్ చేయండి నేను తగ్గేదేలే అంటూ అనసూయ వార్నింగ్ ఇచ్చింది. ఈ వివాదాలు చూస్తే అనసూయ విజయ్ దేవరకొండను ఉద్దేశపూర్వకంగా గెలుగుకుతున్నారని అర్థం అవుతుంది. ఈ క్రమంలో పరిశ్రమ వర్గాలు కూడా ఆమెను వ్యతిరేకిస్తున్నాయి. అనసూయ విజయ్ దేవరకొండను టార్గెట్ చేయడం వెనుక కారణం ఉందని తాజాగా అనసూయ బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ… విజయ్ దేవరకొండతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. మేమిద్దరం ఫ్రెండ్స్. ఆయన నిర్మాతగా తెరకెక్కిన మీకు మాత్రమే చెప్తా మూవీలో నాకు మంచి రోల్ ఆఫర్ చేశాడు.
అయితే అంతకు ముందే నేను అర్జున్ రెడ్డి సినిమాను వ్యతిరేకించాను. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ బూతులు తిట్టడం, ఆ బూతులు ఆఫ్ స్క్రీన్ లో కూడా పలకడం, తన ఫ్యాన్స్ కూడా బూతులు తిట్టేలా చేయడం నాకు నచ్చలేదు. అందుకే వ్యతిరేకించాను. అయితే విజయ్ దేవరకొండ దగ్గర పని చేసే ఓ వ్యక్తి డబ్బులిచ్చి మరీ నన్ను ట్రోలింగ్ చేయిస్తున్నాడని నాకు తెలిసింది. నేను ఆశ్చర్యపోయాను. విజయ్ దగ్గర పని చేసే వ్యక్తి ఇలా చేస్తున్నాడంటే… ఆయనకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా…. అని అనిపించింది, అన్నారు.
కాగా ఈ వివాదాన్ని ఇకపై కొనసాగించేది లేదని అనసూయ అన్నారు. నాకు మానసిక ప్రశాంతత కావాలి. విజయ్ నన్ను ద్వేషిస్తాడో లేదో నాకు తెలియదు. నేను మాత్రం ఇకపై ఆపేయాలని కోరుకుంటున్నాను, అని అనసూయ చెప్పుకొచ్చారు. దీంతో భవిష్యత్ లో అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్స్ ఉండవని క్లారిటీ వచ్చింది. కాగా అనసూయ కీలక రోల్ చేసిన విమానం నేడు విడుదలైంది.