అరెరే.. మోసపోయిన హీరోయిన్ పెళ్ళికి రెడీ !

వ‌య‌స్సు వచ్చాక స‌హ‌జంగానే పెళ్లి గురించి ఆలోచించక తప్పదు. అందులో అమ్మాయిలు అయితే ఇంకా ఎక్కువగా ఊహ‌ల్లో తేలియాడుతుంటారు. త‌మ‌కు కాబోయే వాడిలో ఈ క్వాలిటీ ఉండాలి, ఇది ఉండాలి అంటూ ప్రతి అమ్మాయికి కొన్ని కోరికలు ఉంటాయి. ఎంత హీరోయిన్ అయితే ఏమి ? ఆమె కూడా అమ్మాయే కదా, అందుకే పెళ్లి పై హీరోయిన్ పూర్ణ కూడా చాలా కలలు కన్నది. కానీ ఆమెను ఆ మధ్య ఓ ముఠా పెళ్లి కొడుకు రూపంలో […]

Written By: admin, Updated On : May 8, 2021 10:57 am
Follow us on

వ‌య‌స్సు వచ్చాక స‌హ‌జంగానే పెళ్లి గురించి ఆలోచించక తప్పదు. అందులో అమ్మాయిలు అయితే ఇంకా ఎక్కువగా ఊహ‌ల్లో తేలియాడుతుంటారు. త‌మ‌కు కాబోయే వాడిలో ఈ క్వాలిటీ ఉండాలి, ఇది ఉండాలి అంటూ ప్రతి అమ్మాయికి కొన్ని కోరికలు ఉంటాయి. ఎంత హీరోయిన్ అయితే ఏమి ? ఆమె కూడా అమ్మాయే కదా, అందుకే పెళ్లి పై హీరోయిన్ పూర్ణ కూడా చాలా కలలు కన్నది.

కానీ ఆమెను ఆ మధ్య ఓ ముఠా పెళ్లి కొడుకు రూపంలో వచ్చి పెళ్లి పేరుతో మోసం చేసిన వ్య‌వ‌హారం గురించి తెలిసిందే. సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయిన ఈ న్యూస్, ఆ సమయంలో బాగా వైరల్ కూడా అయింది. చివరకు హీరోయిన్ ను మోసం చేయాలని ప్లాన్ చేసిన ఆ మోస‌గాళ్ల‌ను క‌ట‌క‌టాల పాలు చేశారు. ఇక ఈ నేప‌థ్యంలో పెళ్లంటేనే తనకు ఒక రక‌మైన విర‌క్తి, అప‌న‌మ్మ‌కం కలిగింది అని, అందుచేత ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అప్పుడు కాస్త గట్టిగానే చెప్పింది పూర్ణ.

మొత్తానికి పెళ్లి అంటే భ‌యంతో వ‌ణికిపోయిన ఈ హీరోయిన్, ఎట్టకేలకూ పెళ్ళికి సిద్ధం అయింది. ప్రస్తుతం పూర్ణ పేరెంట్స్ సంబంధాలు చూస్తున్నారు. ఎలాగైనా ఈ ఏడాది తమ కుమార్తెకు పెళ్లి చేసేందుకు పూర్ణ త‌ల్లిదండ్రులు వ‌రుడి కోసం ముమ్మరంగా వెతుకులాట మొద‌లెట్టినట్టు ఉన్నారు. ఓ సంబంధం కూడా దాదాపు ఫిక్స్ అయ్యేలా ఉందట.

మరి పెళ్లి అనంత‌ర తన నటనా జీవితం గురించి, అలాగే తన కెరీర్ గురించి చ‌ర్చించి, వరుడిని ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో పూర్ణ ఉందట. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం చిత్రాల్లో న‌టించిన పూర్ణ, హీరోయిన్ గా మంచి సినిమాలే చేసింది.