భారత నేవీ ఎయిర్ క్రాప్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య నౌకలో శనివారం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగిందని ఓ అధికారి తెలిపారు. నౌకలోని నావికుల వసతి నుంచి పొగరావడాన్ని డ్యూటీ సిబ్బంది గమనించి వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారని పేర్కొన్నారు. అయితే ప్రమాదం ఎలాంటి నష్టం జరుగతేదని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని నౌక ప్రతినిధి తెలిపారు. కర్వార్ హార్బర్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.