https://oktelugu.com/

హైపర్ ఆది పెళ్లి.. అమ్మాయి ఎవ‌రో తెలుసా?

బుల్లి తెర కావొచ్చు.. వెండి తెర‌కావొచ్చు.. ఎవ‌రి కెరీర్ ఎప్పుడు, ఎలా ట‌ర్న్ అవుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. కొంద‌రు తుఫానులా దూసుకొచ్చి ఆ త‌ర్వాత నీరుగారిపోతారు. మ‌రికొంద‌రు చినుకులా వ‌చ్చి తుఫానుగా మారిపోతారు. ఈ రెండో ర‌కానికి చెందిన వాడే హైప‌ర్ ఆది. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలోకి జూనియర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఆ త‌ర్వాత టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. త‌న‌దైన టాలెంట్ నిరూపించుకున్న ఆది.. త‌క్కువ కాలంలోనే బుల్లితెరపై స్టార్ డ‌మ్ సంపాదించుకున్నాడు. […]

Written By:
  • Rocky
  • , Updated On : February 11, 2021 / 01:12 PM IST
    Follow us on


    బుల్లి తెర కావొచ్చు.. వెండి తెర‌కావొచ్చు.. ఎవ‌రి కెరీర్ ఎప్పుడు, ఎలా ట‌ర్న్ అవుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. కొంద‌రు తుఫానులా దూసుకొచ్చి ఆ త‌ర్వాత నీరుగారిపోతారు. మ‌రికొంద‌రు చినుకులా వ‌చ్చి తుఫానుగా మారిపోతారు. ఈ రెండో ర‌కానికి చెందిన వాడే హైప‌ర్ ఆది. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలోకి జూనియర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఆ త‌ర్వాత టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. త‌న‌దైన టాలెంట్ నిరూపించుకున్న ఆది.. త‌క్కువ కాలంలోనే బుల్లితెరపై స్టార్ డ‌మ్ సంపాదించుకున్నాడు.

    Also Read: ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఫిక్స్.. ప్రభాస్ తర్వాత ఈ మూవీనే

    తనవైన పంచులతో స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఆది. ఒక ద‌శ‌లో జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాం ఆది కోస‌మే చూసిన వాళ్లు కూడా ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌లా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు ఆది. అయితే.. కొన్నాళ్లుగా అమ్మాయిల‌తో ఎఫైర్స్ విష‌య‌మై వార్తల్లో నిలిచాడు. యాంక‌ర్‌ అనసూయపై నాన్ వెజ్ పంచులు పేలుస్తూ.. చనువును మించి ద‌గ్గ‌రవుతున్నాడ‌నే పుకార్లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత‌ యాంకర్ వర్షిణితో ల‌వ్ ట్రాక్ నడుపుతున్నాడని కూడా రూమ‌ర్స్ వినిపించాయి.

    అలాంటి ఆది.. స‌డ‌న్ గా త‌న పెళ్లి గురించి చెప్ప‌డం గ‌మ‌నార్హం. యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకుంటే త‌ప్ప, తాను ముందుకెళ్ల‌న‌ని చెప్పిన ఆది.. వారి కంటే ముందుగా పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని తెలుస్తోంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆదిని.. ‘మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా?’ అని యాంకర్ అడిగితే.. ‘మనదంతా మధ్యలోనే చూసి నందించడమే’ అన్నాడు. ఈ సినిమా చూశాక కూడా ప్రేమించాలని అనిపించలేదా? అని అడగ్గా.. ‘అనిపించిందికానీ.. 30 రోజుల్లో వర్కౌట్ అవ్వడమే డౌట్‌’ అంటూ చమత్కరించాడు.

    Also Read: మెగా ఫ్యామిలీలో బ్యాండ్ బాజా.. పెళ్లికి సిద్ధమైన యంగ్ హీరో?

    అయితే.. సినీ తారలు కావొచ్చు.. బుల్లితెర నటులు కావొచ్చు.. చాలా మంది తమ పెళ్లి విషయాన్ని అంత త్వరగా బయటకు చెప్పరు. తొందరగా పెళ్లి పీటలు ఎక్కరు కూడా. ఎక్కడ తమ కెరీర్ రిస్క్ లో పడుతుందోనని ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు చాలా మంది. అయితే.. ఇటీవల ఆది మాట్లాడుతూ.. తన పెళ్లి గురించి చెప్పేశాడు. తమ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని రివీల్ చేశాడు ఆది. దీంతో.. తనకు లవ్ ట్రాక్ ఏదీ లేదని కన్ఫాం చేసిన హైపర్ బుల్లోడు.. పెద్దలు కుదిర్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇండైరెక్టుగా చెప్పేశాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్