https://oktelugu.com/

Hyper Aadi- Pragathi: పిల్లల్ని పెంచమంటే అవి పెంచుతుంది… నటి ప్రగతిపై హైపర్ ఆది దారుణమైన కామెంట్స్

Hyper Aadi- Pragathi: హైపర్ ఆది పంచ్లు అంతకంతకూ శృతి మించి పోతున్నాయి. నటి ప్రగతిని ఉద్దేశిస్తూ ఆయన చేసిన లేటెస్ట్ కామెంట్స్ దుమారం రేపాయి. పిల్లల్ని పెంచాల్సిన వయసులో అవి పెంచుతున్నావంటూ ఆది రెచ్చిపోయాడు. వినాయక చవితి సందర్భంగా ‘మన ఊరి దేవుడు’ అనే స్పెషల్ ఈవెంట్ మల్లెమాల రూపొందించగా, దానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. మన ఊరి దేవుడు ఈవెంట్ లో కుష్బూ, నాగినీడు, కృష్ణ భగవాన్, ఇంద్రజ, హైపర్ ఆదితో పాటు […]

Written By:
  • Shiva
  • , Updated On : August 21, 2022 / 11:30 AM IST
    Follow us on

    Hyper Aadi- Pragathi: హైపర్ ఆది పంచ్లు అంతకంతకూ శృతి మించి పోతున్నాయి. నటి ప్రగతిని ఉద్దేశిస్తూ ఆయన చేసిన లేటెస్ట్ కామెంట్స్ దుమారం రేపాయి. పిల్లల్ని పెంచాల్సిన వయసులో అవి పెంచుతున్నావంటూ ఆది రెచ్చిపోయాడు. వినాయక చవితి సందర్భంగా ‘మన ఊరి దేవుడు’ అనే స్పెషల్ ఈవెంట్ మల్లెమాల రూపొందించగా, దానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. మన ఊరి దేవుడు ఈవెంట్ లో కుష్బూ, నాగినీడు, కృష్ణ భగవాన్, ఇంద్రజ, హైపర్ ఆదితో పాటు పలువురు బుల్లితెర కమెడియన్స్, నటులు పాల్గొన్నారు.

    Hyper Aadi- Pragathi

    అలాగే నటి ప్రగతి కూడా పాల్గొన్నారు. ఆమె లంగా ఓణీ ధరించి మాస్ సాంగ్ కి డాన్స్ దుమ్మురేపారు. మాచర్ల నియోజకవర్గం మూవీలోని ‘రాను రానంటూనే చిన్నదో..’ సాంగ్ కి సూపర్ గా పెర్ఫార్మ్ చేశారు. అనంతరం హైపర్ ఆది స్కిట్ లో ఆమె అత్త పాత్ర చేశారు. ఈ స్కిట్ లో భాగంగా హైపర్ ఆది నటి ప్రగతిని ఉద్దేశిస్తూ దారుణమైన పంచెస్ వేశారు. మనవళ్లకు టీకాలు వేయించాల్సిన వయసులో ఈ టాటూలు ఏంటని ప్రశ్నించాడు. పిల్లల్ని పెంచాల్సిన వయసులో మీరు కండలు పెంచుతున్నారంటూ మరో షాకింగ్ పంచ్ విసిరాడు.

    Also Read: Chiranjeevi Gharana Mogudu: చిరంజీవి ఆ పది కోట్లే టాలీవుడ్ కు పునాదిరాళ్లు!

    హైపర్ ఆది వేసిన ఈ పంచెస్ ఓ రేంజ్ లో పేలాయి. షోలో నవ్వులు పూయించాయి. ప్రగతి కూడా వాటిని చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. అందరితో పాటు ఆమె కూడా నవ్వేశారు. ఓ రెండేళ్ల కాలంగా ప్రగతిలో చాలా మార్పులు వచ్చాయి. ఆమె సోషల్ మీడియా అటెన్షన్ కోరుకుంటున్నారు. హాట్ హాట్ డాన్స్ వీడియోలు చేయడం, జిమ్ వేర్ లో దర్శనమిస్తూ తన ఎక్సరసైజ్ వీడియోలు షేర్ చేయడం అలవాటుగా మారింది.

    Hyper Aadi- Pragathi

    సినిమాల్లో అమ్మ, అత్త పాత్రలు చేసే ప్రగతికి ఉన్న ఇమేజ్ కి, ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ కి పొంతన లేకుండా పోతుంది. ఈ క్రమంలో నెటిజెన్స్ నుండి ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొంటుంది. అయితే అవేమి ఆమె పట్టించుకోవడం లేదు. ఆరోగ్యం కోసం నేను జిమ్ చేస్తున్నాను. మీలాంటి పని లేని వాళ్ళ మాటలు నన్ను ప్రభావితం చేయలేవని కౌంటర్లు విసురుతున్నారు. ఇక ప్రగతి గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కెరీర్ బిగినింగ్ లో ఆమె హీరోయిన్ గా నటించారు. తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన ప్రగతి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాబీ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

    Also Read:Khushi kapoor- Jhanvi Kapoor: అక్క ప్రియుడితో చెల్లెలు ఎఫైర్… అతని వెంట పడుతున్న శ్రీదేవి కూతుళ్లు!

     

     

     

    Tags