https://oktelugu.com/

Hyper Aadi: అమ్మాయిని గెలికిన హైపర్ ఆదిని చితక్కొట్టిన జనాలు… ఏం జరిగిందో స్వయంగా చెప్పిన స్టార్ కమెడియన్

ప్రస్తుతం జబర్దస్త్ కి దూరమయ్యాడు. అయితే మల్లెమాల సంస్థకే చెందిన ఢీ డాన్స్ రియాలిటీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో మాత్రం సందడి చేస్తున్నాడు. షో ఏదైనా హైపర్ ఆది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 15, 2024 / 03:31 PM IST
    Follow us on

    Hyper Aadi: స్టార్ కమెడియన్ హైపర్ ఆదిని జనాలు చితక్కొట్టారట. ఒంగోలులో ఈ సంఘటన జరిగిందట. గతంలో జరిగిన ఈ ఘటనపై హైపర్ ఆది స్వయంగా స్పందించాడు. ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చాడు. జబర్దస్త్ కమెడియన్స్ లో హైపర్ ఆది ఒక సంచలనం. టీమ్ మెంబర్ గా ఎంట్రీ ఇచ్చి, తన టాలెంట్ తో టీమ్ లీడర్ అయ్యాడు. హైపర్ ఆది రైజింగ్ రాజు టీమ్ సూపర్ సక్సెస్. హైపర్ ఆది నాన్ స్టాప్ పంచ్లు జనాలను కడుపుబ్బా నవ్వించేవి. ఏళ్ల తరబడి హైపర్ ఆది జబర్దస్త్ షోలో కొనసాగాడు.

    ప్రస్తుతం జబర్దస్త్ కి దూరమయ్యాడు. అయితే మల్లెమాల సంస్థకే చెందిన ఢీ డాన్స్ రియాలిటీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో మాత్రం సందడి చేస్తున్నాడు. షో ఏదైనా హైపర్ ఆది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటాడు. తన కామెడీతో షోని పరుగులు పెట్టిస్తాడు. అటు వెండితెర మీద కూడా హైపర్ ఆది హవా నడుస్తుంది . దాదాపు పాతిక చిత్రాల్లో హైపర్ ఆది కమెడియన్ గా నటించాడు.

    మరికొన్ని చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. కాగా హైపర్ ఆది ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జోర్దార్ సుజాత హోస్ట్ గా ఉన్న టాక్ షోకి గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా పలు విషయాలు అడిగి తెలుసుకుంది జోర్దార్ సుజాత. కాగా హైపర్ ఆది మీద ఉన్న ఒక రూమర్ పై స్పష్టత కోరింది. గతంలో ఓ అమ్మాయిని మీరు ఇబ్బంది పెడితే… ఒంగోలులో కొట్టారట? కదా అన్ని అడిగింది. ఈ ప్రశ్నకు హైపర్ ఆది షాక్ అయ్యాడు.

    ఛీ ఛీ అదంతా ఏం లేదు. అయినా నేను అమ్మాయిల జోలికి పోను. అసలు వాళ్లతో మాట్లాడను. షోలలో కూడా స్కిట్ లో భాగంగా అమ్మాయిలతో మాట్లాడతాను. కామెడీ పంచులు వేస్తాను. అంతే కానీ షో అయిపోయాక ఎవరితో నేను మాట్లాడను. అలాంటి నేను ఒక అమ్మాయిని గెలకడం, జనాల చేతిలో దెబ్బతులు తినడం ఏమిటన్నాడు. కాబట్టి అది కేవలం పుకారు మాత్రమే. నిజం లేదని చెప్పుకొచ్చాడు. హైపర్ ఆదికి జబర్దస్త్ లో పొట్టి నరేష్ అంటే ఇష్టం అట. తనకు హైట్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా కెరీర్ లో ఎదిగి, కుటుంబం మొత్తాన్ని చూసుకుంటున్నాడు… అని హైపర్ ఆది చెప్పుకొచ్చాడు.