Hyper Aadi- Bigg Boss 6 Telugu: ప్రతి ఆదివారం లాగానే ఈ ఆదివారం కూడా బిగ్ బాస్ హౌస్ మొత్తం ఎంటర్టైన్మెంట్ తో ఫుల్లుగా నిండిపోయింది..అయితే దీపావళి పండుగ సందర్భంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండే బిగ్ బాస్ ప్రారంభం అయ్యింది..ఎంతో మంది సెలెబ్రిటీలు వచ్చి డాన్స్ వేశారు..ఇంటి సభ్యులతో ఆడిపాడారు కూడా..హీరోయిన్ అంజలి తన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘ఝాన్సీ’ డిస్నీ + హాట్ స్టార్ లో విడుదల అవ్వబోతున్నందున ఆ సిరీస్ ప్రొమోషన్స్ కోసం హాజరు అయ్యింది..ఇక ఆ తర్వాత సింగర్ శ్రీ రామచంద్ర కూడా ఒక అతిధి గా హాజరయ్యాడు.

ఇక ఆ తర్వాత ప్రముఖ తమిళ హీరో కార్తీ తన లేటెస్ట్ సినిమా ‘సర్దార్’ ప్రొమోషన్స్ కోసం హాజరయ్యాడు..అయితే వీళ్లందరికంటే హైపర్ ఆది స్పెషల్ అప్పీరెన్స్ అందరిని ఆకట్టుకుంది..హౌస్ మేట్స్ అందరి మీద ఆయన వేసిన పంచులు బాగా పేలాయి..ఉన్న 20 నిముషాలు మంచి ఎంటర్టైన్మెంట్ ని పంచాడు..ఈరోజు జరిగిన ఎపిసోడ్ మొత్తానికి ఇదే హైలైట్ గా చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా ఆయన కొంతమంది కంటెస్టెంట్స్ మీద పేల్చినా జోకులు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది..అంతే కాకుండా బిగ్ బాస్ లో బయట మన గురించి ప్రేక్షకులు ఎలా అనుకుంటున్నారు..మనం ఏ స్థానం లో ఉన్నాము అనేది ఇంటి సబ్యులకు ఒక హింట్ ఇచ్చినట్టు అయ్యింది ఆది ఎంట్రీ..ముఖ్యంగా ఇనాయ సుల్తానా గేమ్ గురించి మాట్లాడుతూ ‘నువ్వు రెండవ వారం లోనే ఎలిమినేట్ అవ్వాల్సిన అమ్మాయివి..కానీ ఆ తర్వాత వారం నుండి నీ ఆట తీరుని మార్చుని గ్రాఫ్ ని అలా పెంచుకుంటూ పోయావు..గత రెండు వారాల నుండి తగ్గింది..మళ్ళీ నువ్వు ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నాను’ అని చెప్తాడు.
అంతే కాకుండా ఇనాయ ఈమధ్య సూర్య కి దూరంగా ఉంటూ శ్రీహాన్ కి దగ్గరవ్వడం పై హైపర్ ఆది పంచు వేస్తూ ‘కిక్ సినిమాలో రవితేజ ని ఉడికించడానికి ఇలియానా బ్రహ్మానందం ని వాడుకునట్టు, ఇక్కడ నువ్వు సూర్య ని ఉడికించడానికి శ్రీహాన్ ని వాడుతున్నావా’ అని అడుగుతాడు..అప్పుడు సూర్య వెంటనే చొరవ తీసుకొని మాట్లాడుతూ ‘వాళ్లిదరు కలిస్తే బాగుంటుంది అని నేనే శ్రీహాన్ తో చాలా సార్లు అన్నాను..కావాలంటే అడగండి’ అంటదు సూర్య..ఇక ఆ తర్వాత శ్రీహాన్ తో మాట్లాడుతూ ‘నువ్వు ఇనాయ గొడవ పడినప్పుడే మాకు ఎంటర్టైన్మెంట్..కలిసిపోతే ఆ ఎంటర్టైన్మెంట్ మాకు రాదు’ అని పంచ్ ఇస్తాడు..ఇక వాసంతి మీద హైపర్ ఆది వేసిన పంచ్ హైలైట్ గా చెప్పుకోవచ్చు..’ఈ అమ్మాయిని చూస్తే నాకు పాపం అనిపిస్తాడు సార్..ఆ అమ్మాయి డిఫెండ్ చేస్తేనేమో నువ్వు నామినేషన్స్ కి బయపడుతున్నావ్ అంటారు..డిఫెండ్ చెయ్యకపోతే ఈ అమ్మాయి నామినేషన్స్ తేలికగా తీసుకుంది అంటారు..నీ బాధ పగోడికి కూడా రాకూడదు రా’ అంటాడు..అంతే కాకుండా ‘దెయ్యం గెటప్ వేసుకున్నప్పుడు కూడా అందం గా అనిపించింది ఈ అమ్మాయికే సార్..నాకు తెలిసి ప్రపంచం లో ఆధార్ కార్డు లో కూడా అందంగా మేకప్ తో కనిపించేది ఈ అమ్మాయి ఒక్కటే అనిపిస్తుంది’ అని పంచ్ వేస్తాడు హైపర్ ఆది..ఈ పంచ్ అన్నిటిలోకి హైలైట్ గా మారింది.

ఇక ఆది రెడ్డి మీద ఆయన వేసిన జోక్ వింటే పగలబడి నవ్వాల్సిందే..’ఆది రెడ్డి నీకు భయం అంటే ఏంటో తెలీదు కదా..ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత హాట్ స్టార్ లో నీ డాన్స్ చూడు..బయపడతావ్..నాకు మించిన డాన్సర్ ఎవ్వరు లేరనుకునేవాడిని..కానీ నాకు పోటీగా ఒక డాన్సర్ ఉన్నాడని చెప్పుకోవడానికి ఈరోజు నాకు గర్వం గా ఉంది..నువ్వు బయటకి వచ్చిన తర్వాత మన ఇద్దరం నాటు నాటు డాన్స్ వేద్దాం..మన దెబ్బకి రాజమౌళి రిటైర్మెంట్ ఇచ్చి పారిపోవాలి’ అంటాడు..అలా ఈరోజు ఎపిసోడ్ మొత్తం హైపర్ ఆది పంచులతో మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగిపోయింది.