Homeఎంటర్టైన్మెంట్Hyper Aadi: 'జబర్దస్త్' లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్ అడుగుతున్నాడంటే..

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా హైపర్ ఆది గురించి మాట్లాడుకోవాలి. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి గా కొనసాగే హైపర్ ఆది , జబర్దస్త్ పై ఇష్టం తో , అదిరే అభి టీం లోకి ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ టీం లో ఉన్నప్పుడే ఆది లోని అద్భుతమైన కామెడీ టైమింగ్ ని గమనించిన జబర్దస్త్ టీం , అతన్ని టీం లీడర్ ని చేసింది. ఇక ఆ తర్వాత హైపర్ ఆది దూసుకుపోయిన విధానం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈటీవీ లో ఆయన లేని ఎంటర్టైన్మెంట్ షో మరొకటి ఉండేది కాదు. అలా వచ్చిన ఫేమ్ తో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

వరుసగా సినిమా అవకాశాలు రావడం తో హైపర్ ఆది జబర్దస్త్ కి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. కానీ ఢీ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో ఆయన కొనసాగుతూనే వచ్చారు. అప్పుడప్పుడు ఈటీవీ లో నిర్వహించే పండుగ ఈవెంట్ షోస్ కి కూడా హాజరు అయ్యేవాడు హైపర్ ఆది. కానీ ‘జబర్దస్త్’ కి సమయ దొరికేది కాదు. అయితే ఇప్పుడు ఆయన మరోసారి జబర్దస్త్ లోకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకంటే ప్రతీ బుధ , గురువారాల్లో ప్రసారమయ్యే ఢీ షో ఇప్పుడు ముగిసింది. ఆ షో కి కేటాయించే డేట్స్ ని ఇప్పుడు జబర్దస్త్ కి కేటాయించాడు హైపర్ ఆది. ఆయన రీ ఎంట్రీ జబర్దస్త్ కి ఎంతో మేలు చేసింది అనే చెప్పాలి. గతంలో హైపర్ ఆది , సుడిగాలి సుధీర్ టీమ్స్ ఈ షో కి వెన్నుముక లాగా నిలుస్తూ వచ్చారు.

కేవలం వీళ్ళ వల్లే ఆ షో కి రేటింగ్స్ వచ్చేవి. ఎప్పుడైతే వీళ్ళు ఆ షో ని వదిలి వెళ్లారో , అప్పటి నుండి ఆ షో పతనం మొదలైంది. రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి. అందుకే టైమింగ్స్ మారుస్తూ వచ్చారు. 13 ఏళ్ళ క్రితం మొదలైన ఈ షో ని ముందుగా గురువారం మాత్రమే టెలికాస్ట్ చేసేవారు, ఆ తర్వాత డిమాండ్ బాగా పెరగడం తో శుక్రవారం కూడా టెలికాస్ట్ అయ్యేలా చేశారు. కానీ కాలక్రమేణా షో కి క్రేజ్ తగ్గుతూ రావడం తో , శుక్ర , శనివారాలకు ఈ షో ని షిఫ్ట్ చేశారు. ఇప్పుడు కేవలం ఆదివారం కి మాత్రమే పరిమితం చేశారు. జులై 26 నుండి ఈ షో ప్రతీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. హైపర్ ఆది రీ ఎంట్రీ తో ఈ షో తలరాత మారుతుందో లేదో చూడాలి , ఒక్కో స్కిట్ కి ఆయన 5 లక్షల రూపాయిలు డిమాండ్ చేస్తున్నట్టు టాక్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version