Rajamouli: వేడి వేడి ఐటెం కి డిమాండ్ ఎక్కువ. చల్లారిపోతే చికెన్ బిర్యాని కూడా చప్పగా తయారవుతుంది. అలాగే డిమాండ్, హైప్ ఉన్నప్పుడే సినిమాను విడుదల చేసి క్యాష్ చేసుకోవాలి. పూర్తిగా ఆసక్తిపోయాక ఆశించినంత ఫలితం రాదు. ఆర్ ఆర్ ఆర్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ అయినప్పటికీ ప్రేక్షకులు ఆశగా ఎదురుచూసిన ప్రతిసారీ ఇలా వాయిదా పడితే అసలుకే మోసం వస్తుంది. నిజానికి ఆర్ ఆర్ ఆర్ రాజమౌళి సినిమా కావడం వలెనే ఇన్ని సార్లు వాయిదా పడినా మూవీపై ఆసక్తి కొనసాగుతుంది. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఏళ్లకు ఏళ్ళు సినిమా విడుదలకు నోచుకోకపోతే ఆ సినిమాపై ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపించరు.

గతంలో అనేక చిత్రాలు ఇలా హైప్ కోల్పోయాక విడుదలై అట్టర్ ప్లాప్ అయ్యాయి. సినిమా లేట్ అయ్యేకుంది మూవీ గురించిన సమాచారం లీక్ అవుతుంది. కథ,నేపథ్యం వంటి కీలక విషయాలు జనాలకు తెలిసిపోతాయి. దీంతో హా.. ఏం చూద్దాంలే తెలిసినదే కదా.. అన్నట్లు తయారవుతారు. జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ విడుదల కావాల్సి ఉండగా రాజమౌళి భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సౌత్ ఇండియా టూ నార్త్ ఇండియా సుడిగాలి పర్యటనలు చేశారు.
Also Read: ఆ వార్తలన్ని కేవలం రూమర్సేనట.. మరి విజయ్ దేవరకొండ మాటేమిటి ?
తీరా విడుదల సమయానికి కరోనా మొండి కాలు అడ్డం పెట్టింది. కరోనా ఆంక్షలు అమలులోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. థియేటర్స్ మూసివేయడం, యాభై శాతం ఆక్యుపెన్సీ వంటి చర్యలు ప్రభుత్వాలు చేపట్టాయి. దీంతో ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా వేశారు. కారణం ఏదైనా ముచ్చటగా మూడోసారి కూడా ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడింది.

గత రెండు నెలలు దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ గురించి చర్చ నడవగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మిగతా పరిశ్రమల మాట అటుంచితే తెలుగులో కూడా ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకోవడం లేదు. పై పెచ్చు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని విస్మరించాడని, మహేష్ తో చేయనున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అయ్యారని కథనాలు వెలువడుతున్నాయి.
వాస్తవం ఏదైనా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కోల్పోయిన బజ్ తిరిగి రాబట్టాలి. లేదంటే ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. దానికి తోడు ఇప్పటికే కోట్ల రూపాయలు ప్రమోషన్స్ కోసం ఖర్చు చేశారు. తిరిగి ఆ స్థాయిలో ప్రచారం కోసం డబ్బు ఖర్చు చేయడం కుదరదు. సినిమా పలుమార్లు వాయిదా పడడం వలన నిర్మాతలు అసహనంగా ఉన్నారు. ఇన్ని పరిమితుల మధ్య రాజమౌళి మునుపటి హైప్ తీసుకురావడానికి ఏం చేస్తాడో చూడాలి.
Also Read: Shruti Haasan: నా బాడీ లో ఆ రెండు పార్ట్శ్ అంటే చాలా ఇష్టం… శృతి బోల్డ్ ఆన్సర్!
[…] Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ సినిమా ‘సర్కారు వారి పాట’. తాజాగా సంగీత దర్శకుడు థమన్ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చాడు. అయితే ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని మహేష్ మరియు కీర్తి సురేష్ ల మధ్య ప్లాన్ చేసిన ఒక బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రెడీ అయిందని తెలుస్తోంది. సంగీత సంచలనం తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పాటలు అన్నీ అద్భుతంగా వచ్చాయట […]
[…] Vijayashanti: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని కమిట్ అయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని.. ఆ పాత్ర ఎన్టీఆర్ కి సవతి తల్లి పాత్ర అని.. కాగా ఆ పాత్రలో విజయశాంతి నటించబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే, మొదట ఆ పాత్రలో ఒకప్పటి మరో స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ను తీసుకోవాలని కొరటాల ప్లాన్ చేశాడట. కానీ చివరకు విజయశాంతిని ఫైనల్ చేశారు. […]