spot_img
Homeఎంటర్టైన్మెంట్Celebrities Arrested: రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు అరెస్ట్.. ఆ హీరో, ...

Celebrities Arrested: రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు అరెస్ట్.. ఆ హీరో, ఆ నిర్మాత కూతురు కూడా

Celebrities Arrested: అర్ధరాత్రి రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయ్యారు కొందరు సినీ ప్రముఖులు, అలాగే కొందరు ప్రముఖుల వారసులు. బంజారాహిల్స్‌లో నిన్న రాత్రి రాడిసన్ బ్లూ హోటల్‌ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారం అందింది. టాస్క్‌ఫోర్స్ అధికారులు సడెన్ గా ఆ హోటల్‌ పై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో ప్రముఖ నటుడు, నిర్మాత కూతురు, ఓ నటి కుమార్తె, మరియు బిగ్‌ బాస్ తెలుగు విజేత – ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, అలాగే కొందరు బడా బాబుల పిల్లలు అడ్డంగా బుక్ అయ్యి.. నేటి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.

Celebrities Arrested
Celebrities Arrested

పైగా ఈ దాడుల్లో భారీగా డ్రగ్స్ దొరికాయి. దీనికితోడు సమయానికి మించి పుడింగ్ మింక్ పబ్‌ నడుపుతున్నారు. దాంతో పబ్ యజమానులతో సహా 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పబ్ ఒక మాజీ ఎంపీ కూతురుది అని తెలుస్తోంది. అయితే, అరెస్టయిన వారిలో సినీ ప్రముఖులతో పాటు బడా బాబుల పిల్లలు కూడా ఉండటంతో పోలీసులు వివరాలు పూర్తిగా బయట పెట్టడం లేదు.

Also Read: Megastar Chiranjeevi: వైరల్ : చిరంజీవి మాటలకు వేదికపైనే ఏడ్చేసిన నటుడు

తమ వివరాలు పూర్తిగా బయట పెట్టకపోయినా, పబ్‌లో టాస్క్‌ఫోర్స్ అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ లో ఆ ప్రముఖుల వారసులు హడావుడి చేస్తూ హంగామా సృష్టించారు. తమను ఎందుకు తీసుకువచ్చారంటూ గొడవకు దిగారు. విచారణ అనంతరం పోలీసులు కొందరిని విడిచిపెట్టారు.

Celebrities Arrested
Celebrities Arrested

తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు దాడులు నిర్వహించడం.. ఉదయం 5 గంటల సమయంలో కొందర్ని విచారించి విడిచి పెట్టడం జరిగింది. అయితే.. అరెస్ట్ అయిన ప్రముఖుల్లో స్టార్ హీరోల బ్రదర్, నటుడు మరియు షోలకు జడ్జ్ అయిన ఓ ప్రముఖ వ్యక్తి కుమార్తె కూడా ఉందట. ఆమెకు ఇప్పటికే పెళ్లి అయ్యింది. ఆమెతో పాటు ఆమె భర్త కూడా ఈ పార్టీలో ఉన్నట్టు తెలుస్తోంది.

అలాగే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కుమార్తె కూడా ఈ పార్టీలో ఉంది. భర్తను పోగొట్టుకున్న తర్వాత ఆ నటి తన కుమార్తెతో కలిసి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె కూతురికి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఇలా రేవ్ పార్టీలో బుక్ అవ్వడం బాధాకరం.

Also Read:Chiranjeevi- Renu Desai: ఎదురుపడ్డ చిరంజీవిని చూసి రేణుదేశాయ్ షాకింగ్ రియాక్షన్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Oktelugu Epaper