Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి ఆరో వారం కొత్తగా ఐదుగురు సెలెబ్రెటీస్ వచ్చారు. ఇంట్లో రేషన్ మొత్తం అయిపోయింది. ఇక హౌస్ మేట్స్ తిండి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఉన్నది సరిపోదు, కావలసినంత తిండి దొరకదు. ముఖ్యంగా యావర్ తిండి సరిపోక నానా తిప్పలు పడుతున్నాడు. దీని గురించి కిచెన్ లో రోజు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. యావర్ తిండి విషయంలో తరచూ ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎందుకంటే యావర్ అందరికంటే ఎక్కువ తింటాడు.
దీని గురించి ప్రియాంక,యావర్ మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. యావర్ రైస్ ఇంకా రోటి రెండు తింటాడు. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కండిషన్ పెట్టారు గౌతమ్, ప్రియాంక.నువ్వు రోటీలు కావాలంటున్నావ్,నీ లాగే వారే వాళ్ళు కూడా అడిగితే ఏం చేయాలి అంటూ యావర్ తో గొడవ పెట్టుకుంది.దీంతో నేను ఒక పూట మాత్రమే తింటాను అని చెప్పాడు ప్రిన్స్.
ఇక మళ్ళీ కిచెన్ లో ఇంకో గొడవ మొదలైంది. తినే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కర్రీ అయిపోయింది అంటూ గౌతమ్ అడిగాడు. శివాజీ కూడా కర్రీ అయిపోయింది అని అరిచాడు. ప్రియాంక ఇక తట్టుకోలేక ఏడ్చేసింది. అందరూ ఈజీ గా మాటలు అనేస్తున్నారు. నేనేమైనా పెట్టనంటున్నాన,ఇదేమి నా ఇల్లు కాదు కదా,బిగ్ బాస్ హౌస్ అంటూ ఎమోషనల్ అయ్యింది.
అందరితో మాటలు అనిపించుకోవడానికి ఇదంతా చేస్తున్నానా, అంటూ ఏడ్చేసింది. కిచెన్ లో ఉన్నా గౌతమ్ ,సందీప్ మాస్టర్ ఇంకా పూజ,అశ్విని లు ఆమెను ఓదార్చారు. ఇక వీకెండ్ దగ్గరవుతుండగా ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. అమర్ దీప్, యావర్, తేజా, శోభా, నయని, అశ్విని శ్రీ, పూజా మూర్తి నామినేషన్స్ లో ఉన్నారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
