Homeఎంటర్టైన్మెంట్Rajamouli : రాజమౌళి-మహేష్ బాబు మూవీ ఎఫెక్ట్, అక్కడ హోటల్స్ ఫుల్, క్యూ కడుతున్న...

Rajamouli : రాజమౌళి-మహేష్ బాబు మూవీ ఎఫెక్ట్, అక్కడ హోటల్స్ ఫుల్, క్యూ కడుతున్న వందల మంది జనాలు!

Rajamouli : SSMB 29 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ శివారులో గల అల్యూమినియం ఫ్యాక్టరీలో పూర్తి చేశారు. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ జరిగింది. సెకండ్ షెడ్యూల్ కొరకు టీమ్ ఒరిస్సా వెళ్లారు. కోరాపుట్ జిల్లా జిల్లా సిమిరిపుర పట్టణంలో గతంలో రాజమౌళి స్టే చేశారు. ఆ సమయంలో సమీపంలోని అందమైన అటవీ ప్రాంతాన్ని చూశాడు. SSMB 29 చిత్రీకరణకు అది బెస్ట్ ప్లేస్ అని ఆయన ఫిక్స్ అయ్యాడు.

Also Read : రాజమౌళి, మహేష్ బాబు మూవీ పై ఆసక్తికరమైన పోస్టు వేసిన ఒడిశా ఉప ముఖ్యమంత్రి!

ప్రస్తుతం దేవమాలి పర్వతం పై SSMB 29 షూటింగ్ జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో గల సాలూరుకి దగ్గరలో ఉంది. ఈ క్రమంలో మహేష్ బాబు, రాజమౌళిని చేసేందుకు అక్కడికి జనాలు పోటెత్తుతున్నారు. సిరిమిపుర లోగల హోటళ్లు జనాలతో నిడిపోయాయట. పెద్ద ఎత్తున మహేష్ బాబు అభిమానులు అక్కడికి చేరుకుంటున్నారని సమాచారం. ఈ కారణంగానే మహేష్ బాబు-రాజమౌళి షూటింగ్ విజువల్స్ బయటకు లీక్ అవుతున్నాయి. ఇటీవల ఓ కీలక సన్నివేశం బయటకు వచ్చింది. దీనిపై రాజమౌళి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి ప్రతిష్టాత్మకంగా SSMB 29 తెరకెక్కిస్తున్నాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నాడని సమాచారం. సలార్ లో పృథ్విరాజ్ కీలక రోల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా SSMB 29 కథ ఇదే అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో హీరో మహేష్ బాబు ప్రయాణం కాశీలో మొదలు అవుతుందట. అక్కడి నుండి హీరో అడవులకు పయనం అవుతాడట.

కథలో కాశీ క్షేత్రం కీలక అంశం అంటున్నారు. మహేష్ బాబు పాత్ర ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా ఉంటుందని ఇప్పటికే తెలియజేశారు. ఇది జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతుంది. యూనివర్సల్ సబ్జెక్టుతో పాన్ వరల్డ్ మూవీగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం కోసం మహేష్ బాబు పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఎన్నడు లేని విధంగా జుట్టు, గడ్డం పెంచాడు. జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. SSMB 29పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Also Read : ఆ సన్నివేశాలపై పై కరీనా కపూర్ షాకింగ్ కామెంట్స్… అందుకే చేయడం లేదట!

 

Exit mobile version