War2 Movie: జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటిస్తున్న ‘వార్ 2′(War 2 Movie) చితంపై ఇటు టాలీవుడ్ లోను, అటు బాలీవుడ్ లోను అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇందులో ఎన్టీఆర్ కాస్త నెగటివ్ టచ్ ఉన్న క్యారక్టర్ చేస్తునం సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ దేశం లో ఎంతో గర్వించదగ్గ టాప్ డ్యాన్సర్స్. ఎవరికీ వారు తమదైన స్టైల్ లో దుమ్ము లేపేస్తుంటారు. అలాంటి వీళ్లిద్దరు కలిసి ఒక ఫ్రేమ్ లో డ్యాన్స్ వేస్తే చూసేందుకు నిజంగానే రెండు కళ్ళు సరిపోవు. ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లు ఉన్నప్పుడు ఏ డైరెక్టర్ అయినా వాళ్ళను వినియోగించుకోకుండా ఉంటారా?, అందుకే ఈ సినిమాలో కూడా ‘నాటు నాటు’ రేంజ్ డ్యాన్స్ నెంబర్ ని ఒకటి డిజైన్ చేసారు మేకర్స్. భవిష్యత్తులో ‘నాటు నాటు’ సాంగ్ గురించి మర్చిపోయి, ఈ పాట గురించే మాట్లాడుకుంటారట, ఆ రేంజ్ లో ప్లాన్ చేసారు.
అయితే నేడు డ్యాన్స్ రిహార్సల్స్ జరుగుతున్న సమయంలో హృతిక్ రోషన్ కాళ్లకు బాగా దెబ్బలు తగిలాయట. దీంతో వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హృతిక్ రోషన్ ఇది వరకు యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు గాయాలు అయ్యాయి. కానీ మొట్టమొదటిసారి ఆయనకు డ్యాన్స్ రిహార్సల్స్ లో గాయం అవ్వడం చూస్తున్నాం. దీనిని బట్టి చూస్తుంటే ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. డాక్టర్లు వారం రోజుల పాటు హృతిక్ రోషన్ ని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారట. దీంతో డ్యాన్స్ రిహార్సల్స్ మధ్యలోనే ఆగిపోయింది. యష్ రాజ్ స్టూడియోస్ ఆవరణలో ఈ పాట చిత్రీకరణ కోసం ఒక భారీ సెట్ ని కూడా ఏర్పాటు చేశారట. ఈ పాట అయిపోయిన వెంటనే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య క్లైమాక్స్ సన్నివేశం ఉంటుందట.
‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి భాగం మనం చూసింది కేవలం టీజర్ మాత్రమేనట. రెండవ భాగానికి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని. ఎన్టీఆర్,హృతిక్ రోషన్ కలిసి స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా అభిమానులకు ఒక పండుగ వాతావరణం లాగానే ఉంటుందని అంటున్నారు. హృతిక్ రోషన్ కి తెలుగు లో కూడా ఎప్పటి నుండో మంచి క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ కి #RRR కారణంగా నార్త్ ఇండియా లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇలా నార్త్, సౌత్ లో సరిసమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఎన్ని బద్దలు అవుతాయో ఊహించుకోవచ్చు. ‘పుష్ప 2’ క్లోజింగ్ కలెక్షన్స్ ని కేవలం వారం లోపు అధిగమించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రేంజ్ సత్తా ఉన్న చిత్రమిది. అయితే ఎన్టీఆర్ ని నెగటివ్ రోల్ లో మన తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారా లేదా అనేది చూడాలి.