Hrithik Roshan : బాలీవుడ్ లో ఖాన్స్ ని సైతం డామినేట్ చేసేంత క్రేజ్,స్టార్ స్టేటస్ ఉన్న హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan). చూసేందుకు హాలీవుడ్ రేంజ్ హీరో లుక్స్ తో కనిపించే ఈయన బాలీవుడ్ లో ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ రికార్డ్స్ ని నెలకొల్పాడు. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు,సౌత్ లో కూడా హృతిక్ రోషన్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన హీరో గా నటించిన క్రిష్ సిరీస్,ధూమ్ 2 చిత్రాలు తెలుగు వెర్షన్ లో కూడా సంచలన విజయాలుగా నమోదు చేసుకున్నాయి. అయితే హృతిక్ రోషన్ తన టాలెంట్ కి తగ్గ సినిమాలు, కాంబినేషన్స్ ని సెట్ చేసుకోలేదని, ఇండియా లోనే నెంబర్ 1 సూపర్ స్టార్ గా ఉండాల్సిన వ్యక్తి ఆ రేంజ్ కి వెళ్లలేకపోయాడని ఆయన అభిమానులు అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : పవన్ కళ్యాణ్ కారణంగానే నేనిలా తయారయ్యాను అంటూ మంచు మనోజ్ కామెంట్స్!
అయితే ఇప్పుడు హృతిక్ రోషన్ తన కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. తనకి మొదటి నుండి సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఉంది అనే విషయాన్ని హృతిక్ రోషన్ గమనించాడు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు సౌత్ మార్కెట్ లో పాగా వెయ్యాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన ‘వార్ 2’ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కూడా ఉన్నాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ సౌత్ సూపర్ స్టార్స్ లో ఒకరు అవ్వడం తో కచ్చితంగా ఆయన కారణంగా వార్ 2 చిత్రానికి ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడుతుంది. కేవలం ఈ ఒక్క సినిమా తో ఆయన సౌత్ మార్కెట్ లో ఆగిపోవాలని అనుకోవడం లేదు. రీసెంట్ గానే KGF సిరీస్ ని నిర్మించిన హోమబుల్ ఫిలిమ్స్ సంస్థ హృతిక్ రోషన్ తో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పందం కుదిరించుకుంది. దానికి సంబంధించిన గ్రాండ్ ప్రకటన కాసేపటి క్రితమే చేశారు మేకర్స్.
ఈ చిత్రానికి డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్(Prashanth Neel) వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రభాస్ తో ‘సలార్ 2’ చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయ్యాక డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ చరణ్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ఇలా వరుసగా మూడు ప్రాజెక్ట్స్ కి కమిట్ అయ్యి ఉన్నాడు. ఈ మూడు చిత్రాలు పూర్తి అయ్యాకనే హృతిక్ రోషన్ తో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. ‘వార్ 2’ తర్వాత హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమాకు ఆయనే డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తాడట. ఈ చిత్రం చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి పూర్తి అవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. ఈలోపు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.