Kannappa: యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గొప్ప గుర్తింపును పొందుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటుంది. తద్వారా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తన సినిమాలు మాత్రమే చేయకుండా మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా వస్తున్న కన్నప్ప సినిమాలో కూడా రుద్ర (Rudra) అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కనిపించేది చాలా తక్కువ డ్యూరేషన్ అయినప్పటికి సినిమా మీద మాత్రం భారీ హెపైతే క్రియేట్ అవుతుంది. ఆయనను ఈ సినిమాలో చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమా మీద మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ఇక మంచు విష్ణు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడానికి రెడీ అవుతున్నాడు…ఇక ఈ సినిమాలో ప్రభాస్ నెక్స్ట్ లెవెల్లో కనిపించబోతున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని బిజినెస్ లు పూర్తి అయిపోయాయి. కాబట్టి అనుకున్న సమయానికి థియేటర్ లోకి తీసుకురావడానికి మంచు విష్ణు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…
అయితే ఈ సినిమాలో ప్రభాస్ చేసినంత వరకు బాగానే ఉంది. కానీ ఈ మూవీ లో ఆయన ఒక మిస్టేక్ అయితే చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ కోసం థియేటర్ కి వచ్చే అభిమానులు సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ గొప్పగా ఉంటే సినిమాని ఒకటికి రెండు సార్లు చూస్తారు.
కానీ ఏ మాత్రం తగ్గినా కూడా సినిమా మీద భారీ విమర్శలైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అలాగే ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్ర వేసి ఉంటే ఇంకా బాగుండేది. రుద్ర అనే నంది క్యారెక్టర్ లో ఆయన కనిపించబోతున్నాడు.
మరి ఆ పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నప్పటికి ప్రభాస్ ను శివుడి పాత్రలో చూడాలని అతని అభిమానులైతే కోరుకుంటున్నారు. ఒకవేళ ఆయన శివుడి పాత్ర వేసినట్లయితే మాత్రం సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అయ్యేది…