Pushpa 3: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తుందా? లేదా అనే విషయంలో కొంతవరకు సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతున్నప్పటికి ఎవరికి వాళ్లు ఒక యూనిక్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు… యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియాలో స్టార్ హీరోలుగా మంచి గుర్తింపు సంపాదించుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్(Sukumar)…ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక అల్లు అర్జున్ (Allu Arjun)తో చేసిన పుష్ప(Pushpa) సినిమా భారీ విజయాన్ని సాధించిన కాకుండా పుష్ప 2 (Pushpa 2) సినిమాతో ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. 1900 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా యావత్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని మరోసారి చాటి చెప్పిందనే చెప్పాలి. ఇక సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎలా ఉన్నా కూడా సినిమా ఒక రూలింగ్ అయితే సెట్ చేసిందనే చెప్పాలి. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. మన నుంచి వచ్చే సినిమాలు వేల కోట్లను వసూలు చేస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని ప్రతి ఒక్కరికి క్లారిటీగా తెలిసింది…
ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా ఎండింగ్ లో పుష్ప 3 ఉంటుందని అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఉంటుందా లేదా అనేది మొన్నటిదాకా సస్పెన్స్ లో పెట్టినప్పటికీ రీసెంట్ గా సుకుమార్ మాత్రం ఈ సినిమా కథ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంటూ ఒక హింట్ అయితే ఇచ్చారు.
పుష్ప రాజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఇక అక్కడ కూడా హీరోయిజన్ని ఎలివేట్ చేస్తూనే కథ నడుస్తుంది అంటూ కొంతమంది క్లారిటీ ఇస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప 3 సినిమా వస్తే మాత్రం అది రికార్డు స్థాయిలో భారీ వసూళ్లను రాబడుతుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. పుష్ప 3 తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు.
తద్వారా అల్లు అర్జున్ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్నాడు. ఇక సుకుమార్ సైతం రామ్ చరణ్ తో సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ ని కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి పుష్ప 3 సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది…