https://oktelugu.com/

Nandamuri Mokshagna : నందమూరి మోక్షజ్ఞ నటన ఎలా ఉండబోతుంది..? ఎన్టీయార్ కి పోటీ ఇస్తాడా..?

సినిమా ఇండస్ట్రీ అంటే కచ్చితంగా హీరోల మధ్య పోటీ అనేది ఉంటుంది. పర్సనల్ విషయాల్లో వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నప్పటికి ప్రొఫెషన్ పరంగా మాత్రం పోటీ పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకరి సినిమాలను మరొకరు బీట్ చేస్తూ భారీ ఇండస్ట్రీ హిట్లను సాధించినప్పుడే వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో కూడా విశేషమైన స్పందనను సంపాదించుకుంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 23, 2024 7:57 pm
    Nandamuri Mokshagna

    Nandamuri Mokshagna

    Follow us on

    Nandamuri Mokshagna : నందమూరి బాలకృష్ణ కొడుకుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ తనదైన రీతిలో నటించి మెప్పించాల్సిన అవసరమైతే ఉంది. నిజానికి ఆయన ఇన్ని రోజుల పాటు నటనలో శిక్షణ తీసుకున్నాడు అంటూ పలు సందర్భాల్లో తెలియజేశాడు. మరి మొత్తానికైతే ఆయన నటనలో ఎలాంటి శిక్షణ తీసుకున్నాడు. ప్రేక్షకులు ఆయన నటనకు ఫిదా అవుతారా? లేదా అనే విషయాలు తెలియాలి అంటే ఆయన నుంచి మొదటి సినిమా రావాల్సి ఉంది. ఇక మొత్తానికైతే తనదైన రీతిలో సత్తా చాటుతున్న బాలయ్య బాబు తన కొడుకుని కూడా స్టార్ హీరోగా ముందుకు తీసుకెళ్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి మొత్తానికైతే ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి. ఇక బాలయ్య బాబు ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసి మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న నటుడు…

    తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న బాలయ్య బాబు తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు. మరి తన కొడుకు కూడా తన నట వారసత్వాన్ని పంచుకొని ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసే విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. నందమూరి ఫ్యామిలీ అనగానే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.

    ఎందుకంటే ఆయన పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అలాగే నటన లోనూ, డాన్స్ లను వేయడంలోనూ, ఫైట్లు చేయడంలోను ఆయనకు ఆయనే సాటి అనిపించేలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా మాస్ సినిమాలను చేస్తూ బీ,సీ సెంటర్లో తనదైన ముద్రను వేస్తూ వస్తున్నాడు. అలాంటి మాస్ హీరోకి పోటీగా మోక్షజ్ఞ నిలబడగలుగుతాడా? నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోల్లో ఎన్టీఆర్ ను బీట్ చేసి తను మంచి గుర్తింపుని సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా నందమూరి ఫ్యామిలీలో ప్రస్తుతం కొన్ని విభేదాలు అయితే వస్తున్నాయి.

    మరి వీళ్ళ మధ్య విభేదాలు తొలగిపోయి అందరూ కలిసి ఒకటిగా సినిమా ఇండస్ట్రీ లో వాళ్ల మనుగడని కొనసాగిస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి ఈ తరం హీరోలు చాలామంది ఇండస్ట్రీకి రావాలని చూస్తున్నారు. మరి వాళ్ళందరూ సక్సెస్ లను సాధిస్తారా? లేదంటే ఫేడౌట్ అయిపోతారా అనేది తెలియాలంటే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…