https://oktelugu.com/

Pushpa 2: The Rule : నెలరోజుల ముందే టికెట్స్ కోసం కొట్లాట..హైదరాబాద్ లో ‘పుష్ప 2’ క్రేజ్ మామూలుగా లేదుగా!

ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ 15 రోజుల ముందు మొదలైంది. అప్పటి నుండే హైదరాబాద్ లో 'పుష్ప 2' టికెట్స్ కోసం డిమాండ్ మొదలైంది. ప్రసాద్ ఐమాక్స్ వంటి మల్టీప్లెక్స్ లో అప్పటి నుండే టికెట్స్ కోసం ఆబ్లిగేషన్స్ పెట్టడం ప్రారంభించారట. కేవలం ఒక్క ప్రసాద్ మల్టీ ప్లెక్స్ మాత్రమే కాదు. హైదరాబాద్ లో ఉన్న నేషనల్ మల్టీ ప్లెక్స్ చైన్స్ కి ఫోన్ కాల్స్ వస్తున్నాయట.

Written By:
  • Vicky
  • , Updated On : November 23, 2024 8:27 pm
    Pushpa 2: The Rule

    Pushpa 2: The Rule

    Follow us on

    Pushpa 2: The Rule :  తెలంగాణ ప్రాంతంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈయన సినిమా విడుదలైంది అంటే హైదరాబాద్ నుండి తెలంగాణ రూరల్ ప్రాంతాల వరకు ఒక పండుగ వాతావరణం కనిపిస్తాది. మొదటి నుండి ఆయనకి మంచి క్రేజ్ ఉంది కానీ, ‘అలా వైకుంఠపురంలో’ చిత్రంతో ఆ క్రేజ్ పదింతలు ఎక్కువ అయ్యింది. ఇక ‘పుష్ప పార్ట్ 1’ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ కి కెరీర్ ప్రారంభం లో తెలంగాణ ప్రాంతం నుండి ఎలాంటి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందో, అల్లు అర్జున్ కి కూడా ఈ సినిమా ద్వారా అలాంటి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ‘పుష్ప 2 :ది రూల్’ చిత్రం పై ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభిస్తారా..ఎప్పుడెప్పుడు టికెట్స్ ని బుక్ చేసుకుందామా అనే రేంజ్ లో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్.

    ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ 15 రోజుల ముందు మొదలైంది. అప్పటి నుండే హైదరాబాద్ లో ‘పుష్ప 2’ టికెట్స్ కోసం డిమాండ్ మొదలైంది. ప్రసాద్ ఐమాక్స్ వంటి మల్టీప్లెక్స్ లో అప్పటి నుండే టికెట్స్ కోసం ఆబ్లిగేషన్స్ పెట్టడం ప్రారంభించారట. కేవలం ఒక్క ప్రసాద్ మల్టీ ప్లెక్స్ మాత్రమే కాదు. హైదరాబాద్ లో ఉన్న నేషనల్ మల్టీ ప్లెక్స్ చైన్స్ కి ఫోన్ కాల్స్ వస్తున్నాయట. చూస్తుంటే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వగానే వీకెండ్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిపోతాయని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయి ట్రెండ్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సిరీస్, సాహూ, సలార్ వంటి చిత్రాలకు జరిగాయి. వాటి తర్వాత ఆ రేంజ్ కెపాసిటీ ఈ సినిమాకే ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ నెలాఖరు నుండి బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. టికెట్ రేట్స్, స్పెషల్ షోస్, బెన్ఫిట్ షోస్ కి కావాల్సిన అనుమతుల గురించి ఇప్పటికే ప్రభుత్వాలకు మూవీ టీం రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం.

    త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా టికెట్ రేట్స్ గురించి సోషల్ మీడియా లో జరుగుతున్నా దుష్ప్రచారం ఫ్రీ నిర్మాతలు మండిపడ్డారు. ఇది వరకు విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలకు ఎంత టికెట్ రేట్స్ పెట్టారో, అంతే మేము పెట్టబోతున్నామని, అంతకు మించి పెట్టట్లేదని, సోషల్ మీడియా లో వచ్చే ఫేక్ ప్రచారాలను నమ్మి మోసపోవద్దు అంటూ నిర్మాతలు ఆడియన్స్ కి చెప్పుకొచ్చారు. డిసెంబర్ 5 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి,, ముందు రోజు రాత్రి పైడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పైడ్ ప్రీమియర్ షోస్ వేసే ఆలోచనలో కూడా ఉన్నారట మేకర్స్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.