Viral News : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. మహారాష్ట్రలోని పూణే నగరంలో ఒక ప్రాంతానికి చెందిన రాహుల్ (పేరు మార్చాం) వ్యక్తికి శృతి అనే స్నేహితురాలు ఉంది.. అతడు ఆమె కలిసి కల్ట్ కళ్యాణి అనే ప్రాంతంలో జిమ్ లోకి వెళ్లేవారు. కండలు పెంచడానికి.. అడ్డదిడ్డంగా పెరిగిన కొవ్వును కరిగించడానికి వారిద్దరు కసరత్తులు చేసేవారు. జిమ్ లో రాహుల్ కు అభిషేక్ అనే ఓ యువకుడు పరిచయమయ్యాడు. అభిషేక్, రాహుల్, శృతి తరచూ మాట్లాడుకునేవారు. వారి ముగ్గురు కలిసి జిమ్ చేసేవారు. రాహుల్, అభిషేక్ ప్రోటీన్ షేక్ కలిసి తాగేవారు. అయితే అభిషేక్ వ్యవహార శైలి శృతికి బాగా నచ్చింది. శృతిని కూడా అభిషేక్ ఇష్టపడ్డాడు. మొత్తంగా వారిద్దరు ప్రేమలో పడ్డారు. అయితే ఈ విషయం తెలియని రాహుల్ వారిద్దరితో సరదాగానే ఉండేవాడు.. అయితే రాహుల్ కు తెలియకుండా అభిషేక్, శృతి తమ వ్యవహారం కొనసాగించేవారు. ఇలా ఒక రోజు అభిషేక్, శృతి పారిపోయారు. ఈ విషయం తెలిసి రాహుల్ గుండె పగిలిపోయింది. తన స్నేహితురాలిని తనకు తెలియకుండా మోసం చేసి.. అలా తీసుకెళ్లినందుకు రాహుల్ తీవ్రంగా బాధపడ్డాడు. ” అతడు నాకు తెలియకుండా ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. స్నేహితుడని చేరదీస్తే నాకొంపకు ఎసరు పెట్టాడు. జిమ్ లో పనిచేసిన వ్యక్తులు మొత్తం మంచివారు. ఒక్క అభిషేక్ తప్ప. అతనితో కలిసి నేను ప్రోటీన్ షేక్ కూడా తాగాను. కానీ అతడేమో నన్ను ఇలా మోసం చేశాడు. వారిద్దరు నా నుంచి దూరంగా పారిపోయిన తర్వాత.. కొద్దిరోజులు అనంతరం నా కళ్ళముందే కనిపిస్తున్నారు. వారిద్దరూ కలిసి ఉంటున్నారు. జిమ్ కు పరిసర ప్రాంతాల్లోనే పనిచేస్తున్నారని” అతడు వాపోయాడు.
జిమ్ కు వన్ స్టార్ రేటింగ్
కల్ట్ కళ్యాణి ప్రాంతంలో ఉన్న ఆ జిమ్ కు రాహుల్ వన్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు . అలా రేటింగ్ ఇచ్చిన తర్వాత తాను తన గర్ల్ ఫ్రెండ్ చేతిలో ఎలా మోసపోయాడో రాసుకొచ్చాడు..” ఇక్కడ ప్రజలు మంచివారు. జిమ్ కూడా బాగుంది. కాకపోతే ఇక్కడ నేను మోసపోయాను. స్నేహితుడని నమ్మితే ఒక వ్యక్తి నన్ను వంచించాడు. నా స్నేహితురాలు కూడా నన్ను కాదనుకొని వెళ్లిపోయింది. అందువల్ల ఈ జిమ్ కు నేను వన్ స్టార్ రేటింగ్ ఇస్తున్నానని” రాహుల్ అందులో రాస్కొచ్చాడు. కల్ట్ కళ్యాణి ప్రాంతంలో జిమ్ కోసం వెతుకుతున్న ఓ యువకుడికి ఆన్లైన్ లో రాహుల్ చేసిన కామెంట్ కనిపించింది. దీంతో అతడు దానిని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. చివరికి జిమ్ లో కూడా రక్షణ లేకుండా పోయిందని.. ఒక వ్యక్తి తన స్నేహితురాలిని కోల్పోవాల్సి వచ్చిందని.. అతడు ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడని..జిమ్ లు కండలు పెంచడానికి, కొవ్వులు కరిగించడానికి కాకుండా.. ప్రత్యేక ఆకర్షణలు కలిగించడానికి కారణమవుతున్నాయని అతడు పేర్కొన్నాడు. పూణేలో జరిగిన ఈ జిమ్ వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది.
was looking for a good gym in my area and saw this review pic.twitter.com/L7lnNZ38eO
— Soham (@king26_sk) November 28, 2024