Bigg boss telugu season 8: బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్స్ ని ఎలా ఎంపిక చేస్తారంటే.. సామాన్యులు కూడా ఈ షోకి వెళ్లవచ్చు

సాధారణంగా కంటెస్టెంట్స్ ని వాళ్ల పాపులారిటీని బట్టి ఎంచుకుంటారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, బుల్లితెర నటులు, కమెడియన్లు, డాన్సర్లు, సింగర్స్ ఇలా కేటగిరీ బట్టి ఎంపిక చేసుకుంటారు. అయితే సామాన్యలు ఈ షో కి వెళ్లడం కస్టమని చాలా మంది భావిస్తారు. కానీ మిగతా నటీనటులతో పాటు సామాన్యులను కూడా ఇంకొక కేటగిరి కింద ఈ షో కి తీసుకుంటారు.

Written By: Kusuma Aggunna, Updated On : September 3, 2024 5:46 pm

Bigg Boss

Follow us on

Bigg boss telugu season 8:  బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలై రెండు రోజులు అవుతుంది. అయితే ఈ షోకి ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులరిటీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ షో కి వెళ్లడానికి చాలామంది పోటీ పడుతుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్న ఆదరణ చూసి ఇండియాలో కూడా ఈ షో ని మొదలుపెట్టారు. మొదటగా బిగ్ బాస్ షోని బాలీవుడ్ లో మొదలుపెట్టారు. దీనికి మంచి ఆదరణ రావడంతో.. మిగతా భాషల్లో కూడా విడుదల చేయాలనుకున్నారు. ఈ క్రమంలో సౌత్ లో కన్నడలో మొదటిగా బిగ్ బాస్ ప్రారంభించారు. అలా తెలుగులో కూడా బిగ్ బాస్ షో ని ప్రారంభించడం మొదలుపెట్టారు. ఇలా 2017 లో బిగ్ బాస్ ని ప్రారంభించగా.. మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించారు. ఈ సీజన్ సూపర్ హిట్ కావడంతో వరుసగా ఈ షో ని నిర్వహిస్తున్నారు. సీజన్ 3కి నేచురల్ స్టార్ నాని నాని హోస్ట్ గా వ్యవహరించారు. సీజన్ 3 నుంచి ఇప్పటివరకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ బిగ్ బాస్ హౌస్ కి సెలబ్రిటీలు, సినీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే వెళ్తారని.. వాళ్లని ఎంపిక చేస్తారని అందరు అనుకుంటారు. కానీ సామాన్య మనుషులు కూడా ఈ షో కి వెళ్ళవచ్చనే విషయం మీకు తెలుసా? మరి ఈ షో కి వెళ్లాలంటే ఎలా అప్లై చేసుకోవాలి? సామాన్యులని ఎంపిక చేసే విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

సాధారణంగా కంటెస్టెంట్స్ ని వాళ్ల పాపులారిటీని బట్టి ఎంచుకుంటారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, బుల్లితెర నటులు, కమెడియన్లు, డాన్సర్లు, సింగర్స్ ఇలా కేటగిరీ బట్టి ఎంపిక చేసుకుంటారు. అయితే సామాన్యలు ఈ షో కి వెళ్లడం కస్టమని చాలా మంది భావిస్తారు. కానీ మిగతా నటీనటులతో పాటు సామాన్యులను కూడా ఇంకొక కేటగిరి కింద ఈ షో కి తీసుకుంటారు. ఈ కేటగిరి లో ఉన్నవాళ్లు స్వయంగా బిగ్ బాస్ మేకర్స్ ని కలిసి ఛాన్స్ ఇవ్వమని అడుగుతారు. ఇలా సామాన్యుల నుంచి చాలా అప్లికేషన్స్ వాళ్లకి వెళ్తాయి. కేటగిరీలో ఒకరి నుంచి ఇద్దరినీ ఎంపిక చేయవచ్చు. వీళ్లని రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అయితే వీళ్లకి పెద్దగా రేమ్యూనరేషన్ ఇవ్వక్కరలేదు. వీళ్లు కూడా పెద్దగా డిమాండ్ చేయరు. కానీ చెప్పుకోతగినంత ఇస్తారు. అయితే ఇలా సామాన్యుల కేటగిరీ నుంచి గణేష్ అనే యువకుడు సీజన్ 2 లో హౌస్ లోకి వెళ్లాడు. మీకు ఫేమ్ లేకపోయినా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బిగ్ బాస్ షో కి వెళ్లవచ్చు. కాకపోతే పోటీ ఎక్కువగా ఉంటుంది. వాళ్లు పెట్టిన టెస్టులో పాస్ అయితే మీరు కూడా హౌస్ లోకి వెళ్లాలి అనే కోరికను తీర్చుకోవచ్చు.