Naga chaitanya – Sobhita : గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్న ఈ జంట నిశ్చితార్థం జరుపుకున్నారు. కాగా సమంత అభిమానులు నిద్ర లేచారు. సోషల్ మీడియా వేదికగా తమ అసహనం వెళ్లగక్కుతున్నారు. సమంత-నాగ చైతన్య క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఏమాయ చేసావే చిత్రంలో జంటగా నటించిన వీరిద్దరూ… నిజంగానే ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ళు రహస్యంగా ప్రేమించుకున్నారు. అనంతరం తమ రిలేషన్ బహిర్గతం చేశారు. 2017లో గోవా వేదికగా సమంత-నాగ చైతన్య వివాహం జరిగింది. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో పెళ్లి వేడుక నిర్వహించారు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. పెళ్లి తర్వాత కూడా సమంత వృత్తిని కొనసాగించింది. సమంత అభిప్రాయాన్ని నాగ చైతన్య గౌరవించాడు.
సడన్ గా ఏమైందో తెలియదు విడిపోయారు. 2021 అక్టోబర్ నెలలో పరస్పర అవగాహనతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వారి అభిమానులు బాధపడ్డారు. మ్యూచువల్ ఫ్యాన్స్ తిరిగి కలిసిపోతే బాగుండని కోరుకున్నారు. సమంత విడాకుల వేదన నుండి బయటపడేందుకు చాలా ప్రయత్నం చేసింది. ఆమె ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించింది. మిత్రులతో ఎక్కువ సమయం గడిపింది.
నాగ చైతన్య అభిమానులు సమంతను… సమంత అభిమానులు నాగ చైతన్యను దూషించారు. కొన్నాళ్లకు నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నాడంటూ కథనాలు వెలువడ్డాయి. మొదట ఊహాగానాలుగా ఉన్న ఈ వార్తలు మరింత బలపడ్డాయి. శోభిత-నాగ చైతన్య కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అప్పటి కూడా నాగ చైతన్య తన రిలేషన్ గురించి ఓపెన్ కాలేదు.
సడన్ గా ఆగస్టు 8న శోభితతో నిశ్చితార్థం జరుపుకుని షాక్ ఇచ్చాడు. నాగ చైతన్య తండ్రి నాగార్జున కొడుకు నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొత్త కోడలికి వెల్కమ్ చెబుతూ సంతోషంతో కూడిన కామెంట్స్ చేశారు. ఈ పరిణామాన్ని సమంత అభిమానులు ఒకింత జీర్ణించుకోలేకున్నారు. సమంత కంటే శోభిత ఏ విధంగా గొప్ప అని నాగ చైతన్యను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో నాగ చైతన్య వివాహ బంధంలో సరిగాలేడు. విడాకులకు సమంత కారణం కాదు. నాగ చైతన్య చేసిన తప్పుల వలనే మనస్పర్థలు తలెత్తాయని అంటున్నారు.
సమంత ఫ్రెండ్ ప్రీతమ్ జుకల్కర్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ కామెంట్ మరిన్ని అనుమానాలకు దారి తీసింది. విడాకుల సమయంలో ప్రీతమ్ అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రీతమ్ తో సమంత ఎఫైర్ పెట్టుకుందని కథనాలు వెలువడ్డాయి. దాంతో నాగ చైతన్య ఫ్యాన్స్ ప్రీతమ్ ని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేధింపులకు పాల్పడ్డారు. దాంతో ప్రీతమ్ వివరణ ఇచ్చాడు. సమంత నాకు అక్కతో సమానం అన్నాడు. అలాగే సమంతతో నాకు ఎలాంటి బంధం ఉందో నాగ చైతన్యకు తెలుసని వాపోయాడు.
నిన్న నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం కాగా, ప్రీతమ్ సోషల్ మీడియాలో…. ఇప్పుడు అతను నీవాడు పతిత. అబద్దాలు, రహస్యాలు బంధాలను నాశనం చేస్తాయి. మీరు ఎంత దాచాలి అనుకున్నా.. దొరికిపోతారు, అని కామెంట్ పోస్ట్ చేశాడు. ఈ మాటలు శోభిత, నాగ చైతన్యలను ఉద్దేశించే ప్రీతమ్ చేశాడని అంటున్నారు, కొందరు. ఆయన మాటలను పరిశీలిస్తే సమంత-నాగ చైతన్య మధ్య విబేధాలకు కారణం శోభిత కావచ్చు అనే వాదన వినిపిస్తోంది. అదే సమయంలో నాగ చైతన్య ఓ ఇంటివాడు అయ్యాడు. సమంత కూడా రెండో వివాహం చేసుకుంటుందా లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి.