Mahesh Babu Ads Remuneration: తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన మహేశ్ బాబు చిత్రాల ఎంపికలో తనదైన శైలి ప్రదర్శిస్తూ అలరిస్తున్నాడు. వైవిద్యమున్న పాత్రలు చేస్తూ ప్రేక్షకుల అంచనాలు అందుకుంటున్నాడు. తొలి చిత్రం రాజకుమారుడు నుంచి ఇటీవల వచ్చిన సినిమాల వరకు ఆయన చూపిన టాలెంట్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. దీంతో అగ్రహీరోగా పేరుతెచ్చుకున్నాడు.
Mahesh Babu Ads Remuneration
మహేశ్ బాబులో కూడా సామాజిక కోణం దాగి ఉంది. ఆయన సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్ సొంతానికి వాడుకున్నా యాడ్స్ లో నటించిన పారితోషికం మాత్రం చిన్న పిల్లల గుండె ఆపరేషన్లకు వినియోగిస్తూ తనలోనూ దాన గుణం ఉందని నిరూపిస్తున్నాడు. ఆయనలోని సేవా భావానికి అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మహేశ్ బాబు ఒక్కో యాడ్ కు రూ. మూడు నుంచి నాలుగు కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలిసిందే.కానీ అదంతా చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల ఖర్చు కోసమే ఉపయోగిస్తున్నాడు. దీంతో మహేశ్ బాబులోని దయా గుణానికి పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వెయ్యికి పైగా ఆపరేషన్లు చేయించి తనలోని దాతృత్వాన్ని చాటుకోవడం తెలిసిందే.
Also Read: Mahesh Babu New Ad: మహేశ్ బాబు ఖాతాలో కొత్త యాడ్.. వీడియో హాలివుడ్ రేంజ్‌లో ఉందిగా..!
అంతేకాదు ఏపీలో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. దీంతో మహేశ్ బాబులోని మరో కోణం మాత్రం ఎవరికి తెలియదు. దీంతో తనలోని సామాజిక స్ప్రహకు కొన్ని కుటుంబాలు లబ్ధి పొంది తమ దేవుడిగా ఆరాధిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ప్రచారం చేసుకుంటారు. కానీ మహేశ్ బాబు మాత్రం తన దయాగుణం గురించి ప్రచారం చేసుకోకుండా అందరిని ఆదుకోవడం తెలుస్తోంది.
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీనిలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. తరువాత రాజమౌళి దర్శకత్వలో ఓ సినిమా అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. దీంతో వరుస సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో కూడా దూసుకుపోవడం చూస్తున్నాం.
Also Read: Mahesh Babu-Balakrishna: మహేశ్ బాబు సినిమాలో బాలయ్య నటిస్తారా? రాజమౌళి ఆఫర్ కు ఓకే అనేస్తాడా?
Recommended Video: