Childhood Photo Story: ఓల్డ్ ఈజ్ గోల్డ్.. అంటారు. కొన్ని పాత విషయాలను గుర్తు చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ప్రస్తుతం విషయాన్ని భవిష్యత్ లో చూసుకునేందుకు ప్రస్తుతం సెల్ ఫోన్ ఉపయోగకరంగా ఉంది. కానీ ఒకప్పుడు ఫొటోలు, వీడియోలే ఆధారం. అలా చాలా మంది ఒకప్పుడు ఫొటోలు తీసుకొని వాటిని భద్రపరుచుకునేవారు. కొన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు వాటిని బయటకు తీసి గత స్మృతులను తలుచుకుంటూ ఆనందిస్తున్నారు. తాజాగా ఓ కుర్రాడి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. భవిష్యత్ లో ఏదో సాధించాలన్న తపనతో చూస్తున్న ఆ కుర్రాడు అనుకున్నట్లే జీవితంలో అత్యున్నతస్థాయికి ఎదిగాడు.. ప్రజా నాయకుడయ్యాడు.. ఇంతకీ ఆ కుర్రాడుఎవరో తెలుసా?
చిన్న వయసులోనే అత్యున్నత పదవి.. ప్రజా సంక్షేమం కోసం ఆరాటపడే మనస్తత్వం.. తాను పుట్టిన గడ్డపై ఉన్న ప్రజలను సంతోషంగా జీవించేందుకు పడే కష్టం.. చూసి ఆయనను మెచ్చుకోని వారుండరు. సంక్షేమ పథకాల ప్రదాతగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎవరో కాదు.. ఏపీ సీఎం వైఎస్ జన్మోహన్ రెడ్డి. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన జగన్ సొంత పార్టీ పెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన శైలిలో పాలన చేస్తూ ఏపీ ప్రజల మన్నలను పొందుతున్నారు. రాజకీయాల్లో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తూ అపరచాణక్యుడిలా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
వైఎస్ జగన్ ది చిన్నప్పటి నుంచి అత్యున్నత కుటుంబమే అయినా.. ఆయన జీవితం ఎంతో సింప్లీ సిటీ అని చెప్పవచ్చు. పెద్ద పెద్ద ఆడంబరం లేకుండా సాగిన ఆయన లైఫ్ లో ఎన్నో విశేషాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1971 డిసెంబర్ 21న కడప (ప్రస్తుతం వైఎస్ ఆర్ జిల్లా) జమ్మలమడుగు గ్రామంలో జన్మించారు. చదువు పూర్తి చేసుకున్న తరువాత జగన్ తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు విద్యుత్ ప్రాజెక్టులు, వ్యాపారాలు నిర్వహించే ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని సంకల్పించాడు.
2009 మే లో తొలిసారిగా లోక్ సభ సభ్యుడిగా గెలిచారు. ఇదే సంవత్సరం సెప్టెంబర్ 9న ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం చెందడంతో రాజకీయాల్లో వచ్చిన మార్పుల కారణంగా కాంగ్రెస్ తో విభేదించి 2011 మార్చి 11న సొంతంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ తరువతాత మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 5.45 లక్షల మెజారిటీతోగెలుపొందారు. అయితే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఆ తరువాత 2019లో 151 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చాడు.
ప్రజా సంక్షేమమే థ్యేయంగా పలు సంక్షేమ పథకాలు ప్రవేవపెట్టి ప్రజల మన్నలను పొందుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన చిన్న నాటి గుర్తులను కొందరు ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. చిన్నప్పుడే జగన్ ఏదో సాధించాలన్న తపనతో చూస్తున్నాడని, ఆ స్వభావం ఆయనలో ఉంది కాబట్టే రాష్ట్రానికి సీఎం అయ్యారని కొందరు కొనియాడుతున్నారు.