https://oktelugu.com/

Spirit movie : ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రంలో ఇంత మంది స్టార్ హీరోలు నటించబోతున్నారా..? సందీప్ వంగ ప్లానింగ్ కి దండం పెట్టొచ్చు!

స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే చాలా గ్రాండ్ గా ఉండబోతుంది. ఎప్పుడు విడుదలైన 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమా స్టోరీ కి తగ్గట్టుగానే స్టార్ క్యాస్టింగ్ కూడా సెట్ చేసుకుంటున్నాడు సందీప్ వంగ.

Written By:
  • Vicky
  • , Updated On : November 11, 2024 / 04:32 PM IST

    Prabhas Spirit Movie

    Follow us on

    Spirit movie :  మరో పదేళ్ళ పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ మాత్రమే నెంబర్ 1 హీరో గా కొనసాగుతాడు , ఆయనకు పోటీ వచ్చే సూపర్ స్టార్ లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్న కాంబినేషన్స్ అలా ఉన్నాయి. బాహుబలి సిరీస్ తర్వాత 5 సినిమాలు చేస్తే ఒక యావరేజ్, రెండు డిజాస్టర్స్, రెండు సూపర్ హిట్స్ తగిలాయి. ముఖ్యంగా సలార్ , కల్కి చిత్రాలు మన టాలీవుడ్ స్థాయి మరింత పెంచాయి. సాలార్ చిత్రం 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టగా కల్కి చిత్రం 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఆ తర్వాత కూడా ప్రభాస్ చేస్తున్న సినిమాలు బయ్యర్స్ కి బంగారు బాతు గుడ్లు లాగా అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘రాజా సాబ్’, ‘సలార్ 2’ మూవీ షూటింగ్స్ లో బిజీ గా ఉన్న ప్రభాస్, త్వరలోనే హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. అదే విధంగా ఫిబ్రవరి నెలలో ఆయన సందీప్ వంగ తో చేయబోతున్న ‘స్పిరిట్’ చిత్రం షూటింగ్ ని కూడా ప్రారంభించబోతున్నాడు.

    స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే చాలా గ్రాండ్ గా ఉండబోతుంది. ఎప్పుడు విడుదలైన 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమా స్టోరీ కి తగ్గట్టుగానే స్టార్ క్యాస్టింగ్ కూడా సెట్ చేసుకుంటున్నాడు సందీప్ వంగ. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది. ఇందులో ఆయన ప్రభాస్ కి తండ్రిగా నటిస్తాడట. కనిపించేది కొద్దిసేపే అయిన ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోని విధంగా మెగాస్టార్ చిరంజీవి క్యారక్టర్ ని డిజైన్ చేసాడట సందీప్ వంగ. ఈయన చిరంజీవి కి వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో విలన్ ప్రముఖ కొరియన్ నటుడు ‘డాన్ లీ’ నటించబోతున్నాడట. ఈయనకి మన ఇండియన్ యూత్ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో కూడా ఆయన ప్రభాస్ ‘సలార్’ ఫోటో ని అప్లోడ్ చేసాడు. దీనిని బట్టి ప్రభాస్ తదుపరి చిత్రంలో ‘డాన్ లీ’ నటిస్తున్నాడు అనేది స్పష్టమైంది.

    అదే విధంగా ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. రణబీర్ కపూర్ తో సందీప్ వంగ చేసిన ‘ఎనిమల్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తనకి అలాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టే సందీప్ అడగగానే ఓకే చెప్పాడట రణబీర్. ఇలా ‘స్పిరిట్’ చిత్రం మొత్తం స్టార్స్ తో కళకళలాడిపోబోతుంది అన్నమాట. వచ్చే ఏడాది నుండి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోబోతున్న ఈ సినిమా 2026 సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది.