
Dil Raju vs Allu Aravind : టాలీవుడ్ లో స్టార్ నిర్మాతగా దశాబ్దాల నుండి కొనసాగుతున్న దిగ్గజం ఎవరైనా ఉన్నారా అంటే అది అల్లు అరవింద్ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఇండస్ట్రీ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం.రీసెంట్ గా ఎంతో మంది ఇండస్ట్రీ కి వచ్చి అగ్ర నిర్మాతలుగా ఎదగవచ్చు, కానీ అల్లు బ్రాండ్ ఇమేజి పవర్ ముందు ఎవరైనా బచ్చాలే అని మరోసారి నేడు రుజువు అయ్యింది.
ఇక అసలు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ – పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఒక ప్రాజెక్ట్ ఎప్పుడో ఖరారు అయ్యింది,పరశురామ్ తదుపరి చిత్రం అదే.ఇందుకు సంబంధించి అన్నీ అగ్రీమెంట్స్ కూడా పూర్తి అయ్యాయి, కానీ దిల్ రాజు సీన్ మధ్యలోకి రావడం అల్లు అరవింద్ కి ఊహించని షాక్ తగిలింది.
ఒకపక్క విజయ్ దేవరకొండ – పరుశురాం పెట్ల కాంబినేషన్ లో సినిమా తియ్యడానికి అల్లు అరవింద్ అన్ని సన్నాహాలు చేసుకుంటే, అదే కథ తో అదే కాంబినేషన్ తో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడని వార్త ఖరారు కావడం తో అల్లు అరవింద్ కోపం కట్టలు తెంచుకుంది.నా ముందు ఇంత మంచిగా ఉంటూ వెనుక చేరి ఇంత మోసం చేస్తారా అని ఆవేశం తో ఊగిపోయిన అల్లు అరవింద్ నేడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి దిల్ రాజు ని కడిగిపారేయడానికి సిద్ధం అయ్యాడు అల్లు అరవింద్.
ఈ వార్త తెలుసుకున్న దిల్ రాజు వెంటనే ప్రొడ్యూసర్ గిల్డ్ చేత అల్లు అరవింద్ కి కాల్ చేయించి దయచేసి ప్రెస్ మీట్ ని ఆపించండి, ఏదైనా అంతర్గతంగా మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకుందాం అని అన్నారట, కానీ అల్లు అరవింద్ ఏమాత్రం తగ్గకపొయ్యేసరికి నేరుగా దిల్ రాజు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి అతనిని క్షమాపణలు కోరి సమస్య పరిష్కారించుకునేందుకు మార్గం వెతికాడట..అలా కర్ర విరగకూడదు పాము చావాలి అన్నట్టు, ఒక్క ప్రెస్ మీట్ కూడా లేకుండా దిల్ రాజు కి ఈ రేంజ్ వణుకు పుట్టించడంటే అల్లు అరవింద్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.