
Oscor Jr NTR : #RRR సినిమా విడుదలై సూపర్ హిట్ సాధించినందుకు మెగా ఫ్యాన్స్ ఎంత సంతోషం గా ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం మొదటి రోజు నుండి నిరాశలోనే ఉన్నారు.ఎందుకంటే రామ్ చరణ్ ని ఒక రేంజ్ లో చూపించి, ఎన్టీఆర్ కి సపోర్టింగ్ రోల్ ఇచ్చారని, మా హీరో మూడేళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసారు అంటూ సోషల్ మీడియా లో రాజమౌళి ని , ఆయన కొడుకుని ట్యాగ్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బండ బూతులు తిట్టడం ప్రారంభించారు.
రాజమౌళి ఎప్పుడు ట్వీట్ వేసిన దాని క్రింద కామెంట్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బూతులు తిట్టడమే ఉండేవి.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి ఈ రేంజ్ వ్యతిరేకతని గమనించిన రాజమౌళి & టీం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసింది.ముందుగా ఆస్కార్ అవార్డ్స్ లో ఎన్టీఆర్ కి నామినేషన్స్ దక్కేందుకు గట్టి క్యాంపైన్ రన్ మూవీ టీం రన్ చేసిందని ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉంది.
ఎన్టీఆర్ కి ఆస్కార్స్ లో నామినేషన్స్ దక్కేందుకు అమెరికా లో పెద్ద క్యాంపైన్ అయితే గట్టియగానే నడించింది.అక్కడి పాపులర్ మ్యాగజైన్ ‘వెరైటీ’ కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు వస్తుందని ప్రెడిక్ట్ చేసింది.అందులో ఒక ప్రముఖ క్రిటిక్ ని రాజమౌళి కుమారుడు కార్తికేయ మ్యానేజ్ చేసాడని, కావాల్సినంత డబ్బులు ఇచ్చి ఆస్కార్ అవార్డు ఎన్టీఆర్ కి వస్తున్నట్టు ప్రచారం చేయించాడని కూడా ఒక రూమర్ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారమైంది.ఎన్టీఆర్ కూడా ‘ఆస్కార్స్’ లో నామినేషన్స్ దక్కబోతుందని భారీ ఆశలే పెట్టుకున్నాడట.అందుకోసం ఆయన కూడా ఖర్చు చేసాడని ఒక రూమర్ అయితే ఉంది.
కానీ ఇంత చేసినా ఆయనకీ ఆస్కార్ లో నామినేషన్ దక్కకపోవడం పై ఎన్టీఆర్ చాలా తీవ్రమైన అసహనం కి గురయ్యాడట.అందుకే ఆయన ఆస్కార్ ఈవెంట్ లో పాల్గొనేందుకు పెద్దగా ఉత్సాహం కూడా చూపించలేదు.ఎదో హాజరు అవ్వాలి కాబట్టి హాజరైనట్టు అనిపించింది అంతే.ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డ్స్ లో నామినేషన్స్ దక్కడానికి అయిన ఖర్చు సుమారుగా 5 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా.
అయితే ఎన్టీఆర్ ని సంతృప్తి పరిచేందుకు డాల్బీ థియేటర్ తో మాట్లాడి సరిగ్గా అవార్డు తీసుకుంటున్న సమయం లో వెనుక స్క్రీన్ మీద పడేలా చేశారట మూవీ టీం.