
Ram Charan : గత మూడు రోజుల నుండి సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రెండ్ అవుతూనే ఉన్నాడు.ఎందుకంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘ఆరెంజ్’ స్పెషల్ షోస్ వెయ్యడం, అవి బంపర్ హిట్ అవ్వడం, రికార్డు వసూళ్లను రాబట్టడం ఇలాంటి అద్భుతమైన విషయాలు జరిగాయి.అంతే కాకుండా ప్రస్తుతం ఆయన శంకర్ తో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు.
ఇలా వరుసగా ఇన్ని శుభవార్తలు ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ బహుశా టాలీవుడ్ లో ఎవ్వరూ లేరనే చెప్పాలి.అభిమానులకే ఈ రేంజ్ లో ఉంటే, ఇక రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి కి ఎంత సంతోషం గా ఉండి ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.నిన్న చిరంజీవి తన కొడుకుని ముద్దు పెట్టుకుంటూ సెల్ఫీ దిగి సోషల్ మీడియా అప్లోడ్ చేసిన ఫోటో కి అదిరిపొయ్యే రేంజ్ రీచ్ వచ్చింది.
అయితే అందరూ తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం ని చూసి మురిసిపోతూ ఉంటే, కొంతమంది నెటిజెన్స్ చూపు రామ్ చరణ్ వేసుకున్న చొక్కా మీద పడింది.ఈ చొక్కాని కొనుగోలు చెయ్యడానికి ఫ్యాన్స్ గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు.కానీ ఆ చొక్కా ధర చూసి వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.ఆ చొక్కా విలువ సుమారుగా 57 వేల రూపాయిలు ఉంటుందట.అంత డబ్బులు పెట్టి కేవలం కోటీశ్వరులు మాత్రమే కొనుగోలు చెయ్యగలరు.
మధ్యతరగతి కుటుంబం లో ఉన్న వాళ్ళు కొనాలంటే కనీసం వారి నెల జీతం ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.అయితే రామ్ చరణ్ అమితంగా ఇష్టపడే అభిమానుల్లో కొంతమంది నెల జీతం ఖర్చు పెట్టి అయినా ఈ చొక్కా కొనుగోలు చెయ్యడానికి ముందుకు వచ్చేస్తున్నారు.అది రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్, రోజు రోజు కి తమ అభిమాన హీరోకి పెరుగుతున్న క్రేజ్ ని చూసి ఎంతో ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోతున్నారు.