Athidhi: టాలీవుడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి సినిమా అంటే మినిమం ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. ఆయన తీసిన ‘కిక్’ సినిమా బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది. ఆయనలా సినిమాలు ఎవరూ తీయలేరు అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ స్టార్ డైరెక్టర్ కు కొన్ని భారీ ప్లాప్ లు వచ్చాయి. వాటిల్లో ‘అతిథి’ ఒకటి. మహేష్ హీరోగా మాస్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉండేవి. ఎందుకంటే అంతకుముందు పోకిరి తో బంపర్ హిట్టు కొట్టిన మహేష్ అదే తరహాలో మరో మూవీ ఉంటుందని అనుకున్నారు. కానీ అతిథి అంతలా ఆకట్టుకులేకపోయింది. అయితే సినిమా ఎలా ఉన్నా ఇందులో కొన్ని పాత్రలు మాత్రం గుర్తుండిపోయే విధంగా ఉన్నాయి. వాటిలో హీరోయిన్ చెల్లెలి పాత్ర ఒకటి.
‘అతిథి’ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ అమృతరావు నటించింది. అమృత రావు తల్లిదండ్రులే మహేష్ ను పెంచారన్న విషయం తెలుసుకొని ఆమెను కాపాడేందుకు వారి ఇంటికి వస్తారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో హీరోయిన్ పక్కన ఓ క్యూట్ పాప కూడా అలరిస్తుంది. అమె బ్రహ్మానందం కూతురుగా కనిపిస్తుంది. హీరోయిన్ తో సమానంగా యాక్ట్ చేసిన ఆమె పేరు కర్మన్ సింధు.

కర్మన్ సింధ్ కు ‘అతిథి’ ఫస్ట్ మూవీనే. కానీ ఎలాంటి కెమెరా ఫీయర్ లేకుండా చాలా చక్కగా నటించింది. అమృతరావు కుటుంబంలోని వ్యక్తిగా అలరించింది. అయితే కర్మన్ సింద్ క్లైమాక్స్ లో కీలకంగా మారుతుంది. ఆమె సినిమాలో చనిపోవడం చూసి ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. సినిమా డిజాస్టర్ కు ఇది కూడా కారణమని చెబుతూ ఉంటారు.తెలుగు సినిమాల్లో కీలక పాత్రలను చంపేస్తే చూడరన్న విషయం తెలియంది కాదు. అయితే సురేందర్ రెడ్డి ధైర్యం చేసి ఈ సీన్ పెట్టారు. కానీ ఆకట్టుకులేకపోయింది.
ఇలా తన పాత్రతో అలరించిన కర్మన్ సింధు ఆ తరువాత మరే సినిమాలో కనిపించలేదు. కనీసం తనకు సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్నట్లు కూడా అనిపించడం లేదు. ఎందుకంటే తాను అందంగా ఉన్నా.. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలనుఎక్కువగా పంచుకోవడం లేదు. కర్మన్ సింధ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే సైకాలజిస్ట్ గా మారింది. మానసిక సమస్యలు ఉన్నవారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారని తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.