https://oktelugu.com/

Rajamouli: రాజమౌళి సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్…లక్కీ ఛాన్స్ కొట్టేశాడుగా…

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. అయితే అందులో భాగంగానే ఆర్టిస్టులను కూడా ఎంపిక చేసే పనులో బిజీ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 13, 2023 / 05:17 PM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు గా పేరుపొందిన రాజమౌళి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో తనదైన సినిమాలను చేస్తూ వరుసగా ఇండస్ట్రీ హిట్లు అందుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు.ఇక ఈ క్రమంలోనే ఆయనతోపాటు సినిమా చేయడానికి బాలీవుడ్ నటులు చాలా ఆసక్తిని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఈయన సినిమాలో బాలీవుడ్ నటుడు ఆయన సంజయ్ దత్ ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. అయితే అందులో భాగంగానే ఆర్టిస్టులను కూడా ఎంపిక చేసే పనులో బిజీ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక దానికి తగ్గట్టుగానే ఒక కీలకమైన పాత్ర కోసం సంజయ్ దత్ ని తీసుకోబోతున్నట్టుగా కూడా వార్తలయితే వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే సంజయ్ దత్ తో మాట్లాడి ఒప్పుకున్న సినిమాలు మొత్తం 2024 సమ్మర్ వరకు కంప్లీట్ చేసుకొని కంప్లీట్ గా ఈ సినిమా కోసం ఒక సంవత్సరం కేటాయించవలసిందిగా చెప్పినట్టుగా తెలుస్తుంది.

    దానికి సంజయ్ ఓకే అన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఒక నటుడు ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమాలో నటిస్తే వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశ్యం తోనే అందరూ కూడా రాజమౌళి సినిమాలో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆ అవకాశం వచ్చింది అంటే మాత్రం తమదైన రీతిలో రెచ్చిపోయి నటిస్తూ నటులు గా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఆరాట పడుతుంటారు. ఇక ఇప్పుడు సంజయ్ దత్ కూడా అదే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే సంజయ్ తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు అయినప్పటికీ రాజమౌళి సినిమాలో నటించడం చాలా ప్రత్యేకం అని తన సన్నిహితుల దగ్గర చెప్తున్నట్టుగా తెలుస్తుంది.

    అయితే ఒక సంవత్సరం పాటు మొత్తం ఆ సినిమాకు డేట్స్ కేటాయించారు రాజమౌళి కోరినట్టుగా తెలుస్తుంది. అందుకు సంజయ్ దత్ ఒప్పుకున్నట్లు గా కూడా తెలుస్తుంది…ఇక ఈ సినిమాతో రాజమౌళి పేరు మరోసారి ఇంటర్నేషనల్ వైడ్ వినిపించబోతున్నట్టు గా తెలుస్తుంది…