Pawan Kalyan new movie benefits: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) ఇప్పుడు చేస్తున్న సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమాతో ఇండియా వైడ్ గా భారీ గుర్తింపును సంపాదించుకొని తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి. అవి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే భారీ రికార్డులను కొల్లగొడతాడనే న్యూస్ అయితే ఇప్పుడు భారీగా వైరల్ అవుతోంది. మరి ‘హరిహర వీరమల్లు’ సినిమా మీద జనాల్లో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఎందుకంటే ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ రావడం వల్ల జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఒకటికి రెండుసార్లు ఈ సినిమాని చూసి ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధింప చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న హీరోలందరు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ మాత్రం కొంతవరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో వాళ్లతో సినిమాలు చేయించి వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read: చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాలో పెరిగిపోతున్న స్టార్ క్యాస్టింగ్…
ఇక ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో ఒక సినిమాని కూడా చేయలేదు. హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పిస్తుందా? తద్వారా బాలీవుడ్ లో ఉన్న ప్రేక్షకులందరు పవన్ కళ్యాణ్ అభిమానులుగా మారిపోతారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి… మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read: రామాయణం తీయబోతున్న మంచు ఫ్యామిలీ..ఈసారి బడ్జెట్ ఎంతంటే!
ఇక బాలీవుడ్ హీరోలు సైతం వెనుకబడిపోతున్న క్రమంలో మన స్టార్ హీరోలు వాళ్ళ సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ సైతం బాలీవుడ్ హీరోలను బీట్ చేస్తూ ముందుకు సాగుతాడా? ఈ సినిమా ద్వారా ఆయన పొలిటికల్ కెరీర్ కి ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…