Ileana: గోవా భామ ఇలియానా మళ్ళీ వచ్చింది. తెలుగు సినిమాల్లో ఇలియానా ఇక నటించదు అనే ప్రచారం నిజం కాలేదు. చాలా గ్యాప్ తర్వాత మేకప్ వేసుకోవడానికి ఇలియానా రెడీ అయ్యింది. మంచు విష్ణు – శ్రీను వైట్ల ఢీ సీక్వెల్ లో ఇలియానా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఈ నెల 14 నుంచి షూటింగ్ కూడా షురూ అయ్యింది.

మొత్తానికి ఇలియానా మళ్ళీ నటిస్తుండడంతో మరో పుకారు కూడా షికారు చెయ్యడం మొదలుపెట్టింది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం రాజుల లక్షణం కాదు కాబట్టి.. ప్రభాస్ మారుతి సినిమా కోసం డేట్స్ కూడా కేటాయించే ప్లాన్ లో ఉన్నాడు.
అయితే, ఈ సినిమా ‘పాన్ ఇండియా’ టైపు మూవీ కాబట్టి.. సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. అందులో ఒక పాత్ర ఇలియానికి బాగా సూట్ అవుతుందట. నిజానికి ఈ పాత్ర కోసం కత్రినా కైఫ్ ను అకున్నారు. కానీ.. కత్రినా కంటే ఇలియానా బడ్జెట్ లో వస్తోంది అని మేకర్స్ కొత్త ఆలోచన. ఎలాగూ ఈ సినిమా ప్రధానంగా తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేసి తీస్తున్న సినిమా.
పైగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందుకే.. ఒక హీరోయిన్ గా ఇలియానా అయితేనే బాగుంటుంది అని మారుతి కూడా ఫిక్స్ అయ్యాడు. కానీ, ప్రభాస్ అలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్నది డౌటే. ఎందుకంటే, ఈ సినిమాని ‘గ్లామరస్’గా ముస్తాబు చెయ్యాలి, అలాగే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా చేయాలనేది ప్రభాస్ ప్లాన్.
అందుకే.. ఈ సినిమాలో మాళవిక మోహనన్, శ్రీలీల వంటి కుర్ర భామలను తీసుకుంటున్నారు. ఈ కుర్ర భామల మధ్య ఫేడ్ అవుట్ అయిపోయిన ఇలియానా ఏమి బాగుంటుంది ? పైగా సీనియర్ హీరోయిన్ అనే బలుపు ఎలాగూ ఇలియానా పుష్కలంగా చూపిస్తోంది. చూడాలి మరి చివరకు ఏమవుతుందో.