Trivikram Ram Charan missed movie: సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం దాన్ని బయటి నుంచి చూసేవాళ్లకు బాగానే ఉంటుంది. కానీ అక్కడ సక్సెస్ ను సాధించడం అనేది అంత సులువు కాదు…కష్టాలు వస్తాయి, కన్నీళ్లు పెట్టుకోవాల్సిన సందర్భాలు ఎదురవుతాయి…వీటన్నింటిని తట్టుకోవాలి అలాంటి వాళ్ళకే ఇక్కడ సక్సెసులు దక్కుతాయి…త్రివిక్రమ్ సైతం ఇలాంటి కష్టాలు పడి వచ్చినవాడే. ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొని అవకాశాన్ని దక్కించుకొని తన మార్క్ చూపించాడు. ఫైనల్ గా మాటల మాంత్రికుడిగా మారాడు. ఒకప్పుడు రైటర్ గా తన పెన్ను బలం ఏంటో చూపించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి భారీ సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో చాలా మూవీస్ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. 80% సక్సెస్ రేటుతో ముందుకు దూసుకెళ్తున్న ఈ దర్శకుడు ప్రస్తుతం వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు… ఈయన చేసిన సినిమాల్లో ఎక్కువ భాగం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లతోనే ఉన్నాయి. వీళ్లను కాదని అతను ఎన్టీఆర్, నితిన్, తరుణ్ లాంటి హీరోలతో మాత్రమే సినిమాలు చేశాడు.
ఇంతకుముందు రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాని రామ్ చరణ్ తో చేయడానికి తను ప్లాన్ చేశాడు. కానీ అది అనుకున్న రేంజ్ లో వర్కౌట్ కాలేదు. దాంతో ఆ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది.
నిజానికి రామ్ చరణ్ ని ఒక ఇంటెన్స్ పోలీసు ఆఫీసర్ క్యారెక్టర్ లో చూపిస్తే అద్భుతంగా నటిస్తాడు. దానికి ధృవ సినిమాను మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అదే జానర్ లో త్రివిక్రమ్ సినిమా చేయడానికి సన్నాహాలు చేశారట. కానీ అది అనుకోని కారణాల వల్ల మెటీరియలైజ్ కాలేదు.
ఇక ఫ్యూచర్ లో వీళ్ళ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే తప్పకుండా ఉన్నాయి అంటూ రామ్ చరణ్ అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమా వచ్చిన కూడా ప్రేక్షకులను నిరాశపరచదనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే రాబోయే రోజుల్లో ఎలాంటి జానర్స్ లో సినిమాలను చేస్తారు. తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే సినిమాగా ఆ సినిమా మారుతుందా? లేదా అనేది చూడాలి…