Are these the directors who could not make films with Pawan Kalyan
Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మొదటి సినిమాతోనే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తను సినిమా ఇండస్ట్రీకి రాకముందే నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ని మొదటి సినిమాలో ప్రజెంట్ చేసి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయాలను అందుకుంటూ వచ్చాయి.
ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో చాలా బిజీగా కొనసాగుతున్నాడు. ఇక ఎలక్షన్స్ ముగిసిన వెంటనే ఆయన ఇంతకుముందు కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసి, మరికొన్ని కొత్త ప్రాజెక్టులను కూడా ఈ సంవత్సరం పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఎప్పుడైతే ఎన్నికలు ముగుస్తాయో వాటి రిజల్ట్ వచ్చిన వెంటనే మళ్ళీ తను షూటింగ్ లో పాల్గొననున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ముందుగా ఓజి, ఉస్తద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేసిన తర్వాత మరికొన్ని సినిమాలకి కమిట్ అవ్వాలని చూస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తో చాలా సంవత్సరాల నుంచి సినిమా చేయాలి అని అనుకుంటూ వచ్చిన చాలామంది దర్శకులు ఆయనతో సినిమాలు చేయకుండానే ఫెడౌట్ అయిపోయారు. ఇక అందులో ముఖ్యంగా వివి వినాయక్, శ్రీనువైట్ల లాంటి దర్శకులు ప్రథమంగా ఉన్నారు. ఇక వీళ్ళు ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలను కూడా రెడీ చేశారు. ఇక అందులో భాగంగానే స్క్రిప్ట్ లను కూడా రెడీ చేసి పవన్ కళ్యాణ్ కి వినిపించారట. అయినప్పటికీ ఆ ప్రాజెక్టు ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ రావడం వల్ల, ఎవరికి వాళ్లు వేరే సినిమాల్లో బిజీగా కొనసాగారు.
అయినప్పటికీ వాళ్లకి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం ఒక్క సారి కూడా రాలేదు. ఇక ఇప్పుడు ఇద్దరు కూడా ఫెయిల్యూర్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందారు. కాబట్టి ప్రస్తుతం వీళ్లు చేస్తున్న సినిమాలు కూడా పెద్దగా బజ్ లేకుండా ఉండటం వల్ల ప్రస్తుతం వీరి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా చేసే అవకాశం లేదనే చెప్పాలి…