Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తూ తనకి పోటీ ఎవరూ లేరు అనేంతలా వరుస బ్లాక్ బాస్టర్స్ ని సొంతం చేసుకున్న హీరో రజనీకాంత్…ఆయన స్టైల్ మరే హీరోకి లేదు. ఆయన ఒక్కసారి తెర మీద కనిపించాడు అంటే తమిళ్ ప్రేక్షకులు మొత్తం ఒక్కసారిగా ఫిదా అయిపోతారు. అలాంటి ఒక స్టార్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్న రజినీకాంత్ తనకంటే సీనియర్ అయిన కమలహాసన్ ని బీట్ చేసి మరి స్టార్ హీరోగా ఎదిగాడు.
అలాగే సౌత్ లో టాప్ హీరోలుగా ఉన్న కమలహాసన్, మోహన్ లాల్ లాంటి ఇద్దరు నటులను బీట్ చేసి పైకి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అయితే వీళ్ళిద్దరిలో లేని ఒక క్వాలిటీ రజనీకాంత్ లో ఉంది అందువల్లే ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు…కమలహాసన్ ఆర్ట్ సినిమాలు ఎక్కువగా చేస్తూ ఒక మెజార్టీ ఆడియన్స్ ను మాత్రమే సంపాదించుకున్నాడు. ఇక మోహన్ లాల్ కూడా వైవిధ్యబరితమైన సినిమాలను చేస్తూ కొంతమందిని మాత్రమే తన ఫ్యాన్స్ ని చేసుకున్నాడు.
రజనీకాంత్ మాత్రం అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా కమర్షియల్ సినిమాలను ఎంచుకొని సక్సెస్ లు సాధించాడు. అలాగే ఆయన చాలా మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా రజనీకాంత్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా అనౌన్స్ అయిన రోజు నుంచి రిలీజ్ అయ్యేంత వరకు ఒకే హైప్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఆయన సినిమాని మొదటి రోజు చూడడానికి ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఆయనకి తమిళంలో ఎంత క్రేజ్ అయితే ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. ఇక విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కమలహాసన్, మోహన్ లాల్ ఇద్దరిని బీట్ చేసి సౌత్ లో సూపర్ స్టార్ గా ఎదగడం అనేది నార్మల్ విషయం కాదు. ఇక తెలుగు విషయానికి వస్తే చిరంజీవికి ఆయనకు మధ్య గట్టి పోటీ అయితే ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయాన్ని చెప్పడం కొంచెం కష్టమే…