Homeఎంటర్టైన్మెంట్Nagarjuna Amala: ఆ విషయంలో నాగార్జునతో అమలకు గొడవలు... ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు!

Nagarjuna Amala: ఆ విషయంలో నాగార్జునతో అమలకు గొడవలు… ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు!

Nagarjuna Amala: నాగార్జున-అమల టాలీవుడ్ స్వీట్ కపుల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మూడు దశాబ్దాలకు పైగా వారి వైవాహిక బంధం సాగుతుంది. అమల బెంగాలీ ఫాదర్, ఐరిష్ మదర్ కి పుట్టిన అమ్మాయి. కానీ పెళ్లి అయ్యాక ఆమె పక్కా తెలుగింటి కోడలిగా మారిపోయింది. నాగార్జునకు అమలతో రెండో వివాహం. నిర్మాత రామానాయుడు కుమార్తె అయిన లక్ష్మీతో నాగార్జున వివాహం జరిగింది. నాలుగేళ్ళ తర్వాత వారు విడిపోయారు. అనంతరం 1992లో అమలను పెళ్లి చేసుకున్నారు. వీరికి అఖిల్ సంతానంగా ఉన్నాడు.

ఇన్నేళ్ళ వైవాహిక జీవితంలో నాగార్జున-అమల గొడవపడినట్లు తెలియదు. అలాంటి వార్తలు రాలేదు. అయితే ఓ విషయంలో నాగార్జున, అమల తరచూ గొడవపడతారట. అదేమిటంటే… ఏదైనా పని మొదలు పెట్టక ముందే అమల నా వల్ల కాదు అంటుందట. లేదు నువ్వు చేయగలవు అని నాగార్జున అంటారట. ఆ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ షురూ అవుతుందట. అయితే ఎంత గొడవపడినా సాయంత్రానికి సాల్వ్ చేసుకుంటారట. మంచిగా మాట్లాడుకుంటారట.

నాగార్జున చాలా మంచివారు. నన్ను బాగా చూసుకుంటారు. అడిగింది కాదనకుండా తెచ్చి ఇస్తారని అమల చెప్పుకొచ్చారు. నాగార్జునతో పెళ్లయ్యాక అమల నటనకు గుడ్ బై చెప్పింది. 1993లో విడుదలైన ఆవేశం అమలకు హీరోయిన్ గా చివరి చిత్రం. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. మనం, ఒకే ఒక జీవితం చిత్రాల్లో అమల క్యారెక్టర్ రోల్స్ చేసింది. అమల సోషల్ యాక్టివిస్ట్ కూడాను. బ్లూ క్రాస్ హైదరాబాద్ కో ఫౌండర్.

మూగ జీవాల సంరక్షణకు కృషి చేస్తున్నారు. అమల కుమారుడు అఖిల్ హీరోగా స్ట్రగుల్ అవుతున్నాడు. అఖిల్ మూవీతో హీరోగా మారిన అఖిల్… అనంతరం మిస్టర్ మజ్ను, హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, ఏజెంట్ చిత్రాల్లో నటించాడు. వీటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. అఖిల్ బ్రేక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.

RELATED ARTICLES

Most Popular