https://oktelugu.com/

Raj Tarun: హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యకు భారీ షాక్… పోలీసులు ఏం చేశారంటే?

Raj Tarun: రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడు. అందుకే నన్ను దూరం పెడుతున్నాడు. గతంలో నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 6, 2024 / 01:59 PM IST

    Big shock for Raj Tarun ex-girlfriend Lavanya

    Follow us on

    Raj Tarun: హీరో రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. లావణ్యకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. ఆమెకు నోటీసులు పంపారు. వివరాల్లోకి వెళితే… హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. రాజ్ తరుణ్ నన్ను శారీరకంగా వాడుకుని మోసం చేశాడు. 11 ఏళ్ళు మేము సహజీవనం చేశాము. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడు. మూడు నెలల క్రితం రాజ్ తరుణ్ నా ఇంటి నుండి వెళ్ళిపోయాడు. నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. చంపేస్తానని బెదిరిస్తున్నాడు.

    రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడు. అందుకే నన్ను దూరం పెడుతున్నాడు. గతంలో నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాడు. 45 రోజులు జైల్లో ఉన్నా ఎలాంటి సహాయం చేయలేదు. అయినప్పటికీ నాకు రాజ్ తరుణ్ కావాలి. పోలీసులు నాకు న్యాయం చేయాలి.. అని కంప్లైంట్ లో ఆమె పేర్కొంది. ఈ ఆరోపణల మీద రాజ్ తరుణ్ స్పందించాడు. లావణ్యతో నాకు రిలేషన్ ఉన్న విషయం నిజమే అన్నాడు. అయితే ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకోలేదు.

    నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు నాకు లావణ్య పరిచయం. ఆ సమయంలో నాకు సహాయం చేసింది. గతంలో లావణ్య మంచి అమ్మాయి. తర్వాత ఆమెకు చెత్త స్నేహితులు తగిలారు. డ్రగ్స్ కి అలవాటు పడింది. డ్రగ్స్ తీసుకుని నన్ను టార్చర్ చేసింది. బ్లాక్ మెయిల్ చేసేది. ఆమెను గుడిలో పెళ్లి చేసుకున్నాను అనేది పచ్చి అబద్ధం. నేను ఈ కేసును లీగల్ గా ఎదుర్కొంటాను… అని అన్నారు. అలాగే మరొక అబ్బాయితో లావణ్య రిలేషన్ పెట్టుకుందని కూడా రాజ్ తరుణ్ ఆరోపించాడు.

    ఇదిలా ఉండగా… రాజ్ తరుణ్ పై లావణ్య కంప్లైంట్ చేసిన నార్సింగ్ స్టేషన్ పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు. రాజ్ తరుణ్ మీద ఆమె చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని సదరు నోటీసుల్లో కోరారు. లావణ్య పోలీసులకు ఆధారాలు సమర్పించాల్సి ఉంది. కాగా రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య ఆరోపిస్తున్న మాల్వి మల్హోత్రా తిరగబడరసామీ మూవీలో హీరోయిన్ గా నటించింది. రాజ్ తరుణ్ విషయంలో లావణ్య-మాల్వి మల్హోత్రా మధ్య ఫోన్లో వాగ్వాదం నడిచింది. ఆ ఆడియో కాల్ రికార్డు లావణ్య లీక్ చేసింది.