https://oktelugu.com/

NTR: వామ్మో ఎన్టీఆర్ ఎంత క్యూట్ గా ఉన్నారో.. ఈ ఫోటోలను చూశారా?

ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించారు తారక్. అయితే గత సంవత్సరం ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు.

Written By: , Updated On : January 20, 2024 / 06:09 PM IST
NTR

NTR

Follow us on

NTR: సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఎంట్రీ ఇచ్చిన జూ. ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో తన దైన ముద్ర వేసుకున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారుండరు. ఈయన క్రేజ్ గురించి ప్రపంచ మొత్తం మాట్లాడుకుంటుందంటే దానికి ఆయన పడ్డ కష్టమే నిదర్శనం. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం అయినా క్రేజ్ ను కాపాడుకోవడం ఈజీ కాదు. ప్రతి సారి సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ ఎంతో కష్టపడ్డారు తారక్. అలా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ప్రేక్షకుల ముందు నిల్చున్నారు.

ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించారు తారక్. అయితే గత సంవత్సరం ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా మీదనే పూర్తి పోకస్ పెట్టారు ఎన్టీఆర్. మరి ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటాయి. కానీ కొన్ని రేర్ ఫోటోలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి ఎన్టీఆర్ రేర్ ఫోటోలు మీకోసం…

NTR

NTR

జూ. ఎన్టీఆర్ హరికృష్ణ, శాలిని దంపతులకు 1983లో మే 20న జన్మించారు. గుడివాడలో ఉన్న మొంటిస్సోరి స్కూల్ లో ప్రాధమిక చదువు పూర్తి చేసి.. ఇంటర్ కోసం హైదరాబాద్ లోని సెయింట్ మేరీ జూ. కాలేజీలో చేరారు నందమూరి తారకరామారావు. చదువు మాత్రమే కాదు ఇటు నటన, కూచిపూడి నాట్యంలో కూడా శిక్షణ పొందారు. ఇక తాతగారు సీ. ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా జూ. ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి తన సత్తా చాటుతూ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారు.

 

NTR

NTR

ఐదు సంవత్సరాల తర్వాత బాల రామాయణం సినిమాలో రాముడిగా నటించారు. ఈయన నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత 2001లో నిన్ను చూడాలని సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అదే సంవత్సరంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 సినిమా హిట్ ను సాధించింది. అలా వరుస సినిమాల్లో నటిస్తూ 20 సంవత్సరాలకే స్టార్ గా ఎదిగి తన సత్తా చాటారు ఎన్టీఆర్.