https://oktelugu.com/

Tamannaah Bhatia : ముంబైలో ఇళ్ళు లగ్జరీ కార్లు తమన్నా ఆస్తి విలువ అన్ని కోట్లా? స్టార్ హీరోలు ఏం సరిపోతారు!

ఇక చిరంజీవికి జంటగా నటించిన భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కీలక రోల్ చేసింది. భోళా శంకర్ విధులకు ఒక రోజు ముందు జైలర్ విడుదల కానుంది.

Written By:
  • NARESH
  • , Updated On : July 30, 2023 / 07:57 PM IST
    Follow us on

    Tamannaah Bhatia : హీరోయిన్ తమన్నా భాటియా చిత్ర పరిశ్రమకు వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది.కెరీర్ తెలివిగా ప్లాన్ చేస్తున్న అమ్మడు వందల కోట్లు కూడబెట్టారని సమాచారం. తమన్నా ఆస్తుల విలువ ఇదంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. తమన్నాకు హ్యాపీ డేస్, 100% లవ్ చిత్రాలు ఫేమ్ తెచ్చాయి. అనంతరం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు హిందీలో కూడా చేసింది. ప్రస్తుతం తమన్నా సినిమాకు రెండు కోట్లకు పైనే తీసుకుంటుంది.

    స్టార్ హీరోయిన్ గా రిటైర్ అయినా ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. చిరంజీవి, రజినీకాంత్ వంటి ఎవర్ గ్రీన్ స్టార్స్ తో ఆమె నటిస్తున్నారు. మరోవైపు వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. ఇక బ్రాండ్ ప్రొమోషన్స్, మోడలింగ్ ద్వారా మరికొంత సంపాదిస్తుంది. ఒక అంచనా ప్రకారం తమన్నా ఆస్తుల విలువ రూ. 120 కోట్లు అట. ఏడాదికి రూ. 15 కోట్ల వరకు సంపాదిస్తుంది అట. తమన్నాకు విలువైన ప్రాపర్టీస్, లగ్జరీ కార్లు ఉన్నాయట.

    ముంబైలో వర్సెవా ఏరియాలో రూ. 16 కోట్ల విలువైన అపార్ట్మెంట్ ఉందట. అలాగే హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉందట. ల్యాండ్ రోవర్ డిస్కవరీ, బీఎండబ్ల్యూ 5 సిరీస్, మెర్సిడెజ్ కార్లు ఉన్నాయట. భవిష్యత్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా తమన్నా నిలబెట్టుకున్నారట. కాగా తమన్నా తన ప్రేమికుడిని ఇటీవల పరిచయం చేసింది. నటుడు విజయ్ వర్మను ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతనితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంది.

    ఇక చిరంజీవికి జంటగా నటించిన భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కీలక రోల్ చేసింది. భోళా శంకర్ విధులకు ఒక రోజు ముందు జైలర్ విడుదల కానుంది. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలవుతుంది. ఇవి రెండు భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. ఒక రోజు వ్యవధిలో తమన్నా నటించిన రెండు చిత్రాలు విడుదల కానున్నాయి.