Balakrishna Daughter: టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా పై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్ చేసాడు. అఖండ అఖండమైన విజయంతో బాలయ్య మార్కెట్ అమాంతం పెరిగింది. అందుకే, బాలయ్య సినిమా కోసం అనిల్ రావిపూడి తెగ ఉత్సాహం చూపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి అనిల్ మూడు మేజర్ అప్డేట్స్ ఇచ్చేశాడు.

మొదటి అప్ డేట్.. ఈ సినిమా కథ తండ్రి – కూతురు మధ్య సాగుతుంది. ఫాదర్ ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. ఇక రెండో అప్ డేట్.. ఈ సినిమాలో బాలయ్య తండ్రి వయసు వ్యక్తిలా కనిపించబోతున్నారు. అంటే 47 ఏళ్ల తండ్రిగా బాలయ్య కనిపిస్తారు. అలాగే మూడో అప్ డేట్ విషయానికి వస్తే.. సెప్టెంబర్ నుంచే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. అదే విధంగా బాలయ్య క్యారెక్టరైజేషన్ గురించి కూడా అనిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సినిమాలో బాలయ్య క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్ మూమెంట్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇక తన మార్క్ కామెడీ, కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కూడా పుష్కలంగా ఉంటాయని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఈ సినిమాలో కూతురు పాత్రలో ఎవరు నటిస్తున్నారో తెలుసా ? ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీలా నటిస్తోంది.
Also Read: Naga Chaitanya With Flop Director: ప్లాప్ డైరెక్టర్ తో నాగచైతన్య.. ఫామ్ లోకి వస్తాడా ?
హాట్ యంగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామ బాలయ్యకి కూతురు నటిస్తుండటం నిజంగా విశేషమే. శ్రీలీల కూతురిగా బాలయ్య తండ్రిలా కాంబినేషన్ అదిరిపోయింది. అన్నిటికీ మించి అనిల్ రావిపూడి – బాలయ్య బాబు లాంటి క్రేజీ కలయికలో సినిమా అంటే ఆ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. మరోపక్క ‘అఖండ’తో బాక్సాఫీస్ దగ్గర ‘నటసింహం’ కలెక్షన్ల సునామీ చూపించాడు. మొత్తానికి అఖండ ఇచ్చిన అఖండమైన విజయంతో బాలయ్య తన మిగిలిన సినిమాల విషయంలో కూడా వేగం పెంచాడు.
Also Read: Ameesha Patel: 46 ఏళ్ల వయసులో ఘాటు ఫోజులు.. ఇది అందాల రచ్చ !
Recommended videos