Homeఎంటర్టైన్మెంట్Mansoor Ali Khan: నా పై విష ప్రయోగం జరిగింది... ఆసుపత్రి పాలైన నటుడు కీలక...

Mansoor Ali Khan: నా పై విష ప్రయోగం జరిగింది… ఆసుపత్రి పాలైన నటుడు కీలక ఆరోపణలు!

Mansoor Ali Khan: నటుడు మన్సూర్ అలీ ఖాన్ కీలక ఆరోపణలు చేశారు. తనపై విషప్రయోగం జరిగిందని బాంబు పేల్చాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్సూర్ అలీ ఖాన్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. వేలూరు నియోజకవర్గం నుండి మన్సూర్ అలీ ఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాగా మన్సూర్ అలీ ఖాన్ అస్వస్థతకు గురయ్యాడు.

ఆయనకు ఛాతిలో నొప్పిరావడంతో వెంటనే గుడియాతం లో గల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు అక్కడే చికిత్స జరుగుతున్నట్లు సమాచారం. తనపై విష ప్రయోగం జరిగిందని మన్సూర్ అలీ ఖాన్ ఆరోపణలు చేస్తున్నారు. గుడియాతం సంత నుండి ఇంటికి బయలు దేరి వెళుతుండగా ఒకరు నాకు జ్యూస్ ఇచ్చారు. అది తాగిన కాసేపటికి నాకు గుండెలో నొప్పి వచ్చిందని ఆయన అన్నారు. తన అనారోగ్యానికి కారణం అదే అంటున్నారు.

మన్సూర్ అలీ ఖాన్ ఆరోపణల ప్రకారం ఆయనపై కుట్ర జరిగింది. హత్యాయత్నం చేశారని మన్సూర్ అలీ ఖాన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మన్సూర్ అలీ ఖాన్ తరచుగా వివాదాల్లో ఉంటున్నారు. హీరోయిన్ త్రిషను ఉద్దేశిస్తూ మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. లియో మూవీలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను. ఆమెను బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లాలి అనుకున్నాను.

కనీసం కాశ్మీర్ లో త్రిషను నాకు చూపించలేదని మన్సూర్ అలీ ఖాన్ మీడియా సమావేశంలో అన్నాడు. మన్సూర్ అలీ ఖాన్ తీరుపై త్రిష మండి పడింది. పలువురు చిత్ర ప్రముఖులు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను ఖండించారు. మన్సూర్ అలీ ఖాన్ ఈ వివాదంపై స్పందించిన వారి మీద పరువు నష్టం దావా కేసు వేశాడు. అయితే కోర్టు అతనికే అక్షింతలు వేసింది.

RELATED ARTICLES

Most Popular