OTT Harror Movie : ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో వస్తున్న ప్రతీ సినిమా కూడా ప్రేక్షకుడిని చాలా వరకు ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాయనే చెప్పాలి. కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అయి సక్సెస్ ని సాధించిన తర్వాత ఓటిటి ప్లాట్ ఫామ్స్ లోకి వస్తుంటే మరి కొన్ని సినిమాలు మాత్రం డైరెక్ట్ గా ఓటిటి లోనే రిలీజ్ అయి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాయి. ఇక వివిధ భాషల్లో ఉన్న దర్శకులు వాళ్ళ సినిమాలతో ఎలాగైనా సరే స్టార్ డమ్ ను సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతోనే మంచి కాన్సెప్ట్ లను ఎంచుకొని సినిమాలు గా చేస్తున్నారు. ఇక మొత్తానికైతే వాళ్ళు చేసే ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడమే కాకుండా తద్వారా వాళ్లు కూడా ఒక మంచి సక్సెస్ అయితే సాధించుకునేలా సినిమాలను తీర్చిదిద్దుతున్నారు. ఇక రీసెంట్ గా ఆహా లో కళింగ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ధియేటర్ లో రిలీజ్ అయి అక్కడ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక దాంతో ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా ఈ సినిమాని చూడడానికి చాలామంది ఆసక్తి అయితే చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా భారీ వ్యూయర్ షిప్ ని దక్కించుకుంటూ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి.
ఇక హర్రర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉందని తద్వారా ఈ సినిమా వల్ల అందరూ ఎంటర్ టైన్ అవ్వడమే కాకుండా ఒక కొత్త కథను చూసిన థ్రిల్ కూడా పొందుతారనే ఉద్దేశ్యంతో చాలామంది ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అందుకే ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్రెండ్స్ కి గాని, ఫ్యామిలీ మెంబర్స్ కి గాని ఈ సినిమాని చూడమని సజెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా భారీ వ్యూయర్ షిప్ ను దక్కించుకోవడమే కాకుండా ఆహా లోనే ఒక సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఈ మధ్యకాలంలో హార్రర్ సినిమాలు తెలుగులో పెద్దగా రాలేదు.
అందువల్ల ఈ సినిమాకి భారీ క్రేజ్ అయితే దక్కుతుంది. మరి కాంతార సినిమా ఫ్లేవర్ తో వచ్చిన కళింగ సినిమా ప్రేక్షకులను హుక్ చేస్తూ సినిమా మొత్తం చూసే విధంగా సస్టైన్ చేయడమే కాకుండా ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా ఉంది. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాని చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు…