Malvi Malhotra : న్యాయ పోరాటంలో గెలిచిన రాజ్ తరుణ్ ప్రేయసి మాల్వి మల్హోత్రా.. నిర్మాతకు 3 ఏళ్ళ జైలు శిక్ష!

ఈ సందర్భంగా మాల్వీ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ పెడుతూ 'చివరికి నా నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటానికి న్యాయం జరిగింది. ఇప్పుడు కాస్త నాకు ఉపశమనం కలిగింది. ఈ పోరాటం లో నాపై ఎన్నో ఒత్తిడులు ఎదురయ్యాయి, ఎన్నో ఆటంకాలను ఎదురుకోవాల్సి వచ్చింది.

Written By: Vicky, Updated On : October 8, 2024 7:46 pm

Malvi Malhotra Case

Follow us on

Malvi Malhotra :  ఇటీవల కాలం లో మీడియాలో ప్రతీ రోజు మనకి బాగా వినిపించిన పేర్లలో ఒకటి మాల్వీ మల్హోత్రా. రాజ్ తరుణ్ – లావణ్య ప్రేమ వ్యవహారం తెర మీదకు వచ్చిన తర్వాత మాల్వీ మల్హోత్రా పేరు కూడా మారుమోగిపోయింది. రాజ్ తరుణ్ తనని ప్రేమించి మోసం చేసాడని, మాల్వీ మల్హోత్రా తో గత కొంతకాలం నుండి ఉంటున్నాడని, నా భర్త నాకు కావాలి అంటూ ఆమె నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసింది. ఆ తర్వాత పలు డిబేట్స్ లో పాల్గొని పెద్ద ఎత్తున రచ్చ చేసింది. నెల రోజుల క్రితం ఈమె రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఉంటున్న ఒక ప్రైవేట్ హోటల్ కి వెళ్లి, అక్కడ పెద్ద గొడవ చేసింది. అయితే ఈ వ్యవహారం లో రాజ్ తరుణ్ తప్పు ఏమి లేనట్టుగా పోలీసులకు అనిపించిందో ఏమో తెలియదు కానీ, అతని పై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోలేదు.

రీసెంట్ గా ఈ గోల మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా కలిసి ‘తిరగబడరాసామీ’ అనే చిత్రంలో హీరో హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ప్రేమించుకుంటున్నారు అనే విషయం దాదాపుగా అందరికీ అర్థం అయ్యింది కానీ, వీళ్ళు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు, మేము కేవలం స్నేహితులం అని మాత్రమే అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే నాలుగేళ్ల క్రితం ఈమె ఒక ప్రముఖ నిర్మాత తనపై దాడి చేశాడంటూ సాక్ష్యాధారాలతో కోర్టులో కేసు వేసింది. 2020 వ సంవత్సరం లో యోగేష్ సింగ్ అనే నిర్మాత, మాల్వీ ని పెళ్లి చేసుకోమని వేధించేవాడట. ఆమె ఒప్పుకోకపోవడం తో ఒక రోజు మాల్వీ మల్హోత్రా తన ఇంటికి సమీపం లో నడిచి వస్తుండగా, కేఫ్ వద్ద యోగేష్ సింగ్ ఆమెను అడ్డుకున్నాడు. నన్ను అసలు పట్టించుకోవా?, నా ఫోన్ కాల్స్ ఎత్తుకోకుండా ఉంటావా?, అని ఆమెతో నడిరోడ్డు మీద గొడవపడి కత్తితో దాడి చేసి పారిపోయాడు.

దీంతో మాల్వీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు యోగేష్ ని అరెస్ట్ చేసారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కోర్టు లో ఈ కేసు నడుస్తూనే ఉంది. ఎట్టకేలకు మాల్వీ కి అనుకూలంగా తీర్పుని ఇస్తూ యోగేష్ కి 3 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా మాల్వీ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ పెడుతూ ‘చివరికి నా నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటానికి న్యాయం జరిగింది. ఇప్పుడు కాస్త నాకు ఉపశమనం కలిగింది. ఈ పోరాటం లో నాపై ఎన్నో ఒత్తిడులు ఎదురయ్యాయి, ఎన్నో ఆటంకాలను ఎదురుకోవాల్సి వచ్చింది. కానీ ఎట్టకేలకు ఆధారాలతో సహా నిజం బయటపడింది’ అంటూ మాల్వీ మల్హోత్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.