Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ మూవీలో బాలయ్య హీరోయిన్… రంగంలోకి హాట్ బ్యూటీ!

ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ చిత్రం తేరి రీమేక్. అయినప్పటికీ సమూల మార్పులు జరిగాయి. మూల కథ మాత్రమే తీసుకుని సన్నివేశాలు, నేపథ్యం కూడా మార్చేశారని సమాచారం.

Written By: Shiva, Updated On : October 7, 2023 9:09 am

Ustaad Bhagat Singh

Follow us on

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో రఫ్ ఆడిస్తూనే ఇటు సినిమాలు పూర్తి చేస్తున్నారు. ఆయన నటిస్తున్న మూడు ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. హరి హర వీరమల్లు వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ చిత్రీకరణ జరుపుకుంటుంది. దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ని చకచకా పూర్తి చేస్తున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ రెండు షెడ్యూల్స్ లో పాల్గొన్నారు. 2024 సమ్మర్ కి ముందే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల ఉండే ఆస్కారం కలదు.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ చిత్రం తేరి రీమేక్. అయినప్పటికీ సమూల మార్పులు జరిగాయి. మూల కథ మాత్రమే తీసుకుని సన్నివేశాలు, నేపథ్యం కూడా మార్చేశారని సమాచారం. చెప్పాలంటే స్ట్రెయిట్ మూవీలానే ఉంటుంది. ఈ విషయంలో హరీష్ శంకర్ దిట్ట. గబ్బర్ సింగ్ విషయంలో మనం చూశాం.

Ustaad Bhagat Singh

గబ్బర్ సింగ్ దబంగ్ రీమేక్ అంటే నమ్మలేం. అంతగా పవన్ ఇమేజ్ కి తగ్గట్లు హరీష్ శంకర్ స్క్రిప్ట్ మార్చి తెరకెక్కించారు. ఇక దాదాపు 11 ఏళ్ల అనంతరం వీరి కాంబోలో మూవీ సెట్ అయ్యింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా ఓ క్రేజీ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. వీర సింహారెడ్డి చిత్రంలో బాలయ్యతో జతకట్టిన హనీ రోజ్ కీలక రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

సెకండ్ హీరోయిన్ రేంజ్ కలిగిన కీలక పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. హనీ రోజ్ కి టాలీవుడ్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. వీర సింహారెడ్డి ఆమెను పాప్యులర్ చేసింది. 14 ఏళ్లకే హీరోయిన్ గా మారిన హనీ రోజ్ 2008లో ఆలయం అనే తెలుగు మూవీ చేసింది. అనంతరం 2014లో ఈ వర్షం సాక్షిగా చిత్రంలో నటించింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.