https://oktelugu.com/

Deepthi Sunaina: పడక గది ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చిన బిగ్ బాస్ దీప్తి… అతన్ని రెచ్చగొట్టాలనేనా!

దాదాపు 10 వారాలు దీప్తి హౌస్లో ఉంది. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు. గీతా మాధురి రన్నర్ టైటిల్ తో సరిపెట్టుకుంది. బిగ్ బాస్ షో అనంతరం దీప్తి ప్రేక్షకులకు మరింత చేరువైంది.

Written By:
  • Shiva
  • , Updated On : October 7, 2023 / 09:16 AM IST
    Follow us on

    Deepthi Sunaina: బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. షార్ట్ ఫిల్మ్, డాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్లతో ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దీప్తి సునైన బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొనడం విశేషం. నాని హోస్ట్ గా ప్రసారమైన ఆ సీజన్లో టాప్ సెలెబ్స్ పార్టిసిపేట్ చేశారు. కౌశల్, తేజస్వి మాదివాడ, నందిని, గీతా మాధురి, కిరీటి వంటి పేరున్న నటులు, సింగర్స్ భాగమయ్యారు వాళ్లతో పోల్చుకుంటే దీప్తికి పాపులారిటీ తక్కువే. అయినా హౌస్లో దీప్తి రాణించింది.

    దాదాపు 10 వారాలు దీప్తి హౌస్లో ఉంది. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు. గీతా మాధురి రన్నర్ టైటిల్ తో సరిపెట్టుకుంది. బిగ్ బాస్ షో అనంతరం దీప్తి ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆమె యూట్యూబ్ వీడియోలకు ఆదరణ పెరిగింది. కాగా దీప్తి తన డాన్స్ పార్ట్నర్ షణ్ముఖ్ జస్వంత్ ని ప్రేమించింది. వీరిద్దరూ కలిసి అనేక షార్ట్ ఫిల్మ్, డాన్స్ వీడియోలు చేశారు.

    అయితే 2021 చివర్లో షణ్ముఖ్ కి దీప్తి గుడ్ బై చెప్పేసింది. కొన్ని కారణాలతో షణ్ముఖ్ తో బ్రేకప్ అవుతున్నట్లు వీడియో విడుదల చేసింది. ఇకపై తన దృష్టి కెరీర్ మీదే అంటూ ఎమోషనల్ అయ్యింది. తన నిర్ణయానికి కారణం మాత్రం ఆమె చెప్పలేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్ ప్రవర్తన నచ్చకే దీప్తి దూరమైందనే వాదన ఉంది. షణ్ముఖ్ లేడీ కంటెస్టెంట్ సిరితో రొమాన్స్ చేశాడు. కెమెరాలు ఉన్న విషయం కూడా మర్చిపోయి వీరు మమేకం అయ్యారు.

    చివరి వరకు హౌస్లో గేమ్ కలిసి ఆడారు. సిరికి దగ్గరైన షణ్ముఖ్ వ్యవహారం నచ్చని దీప్తి అతనికి దూరమైందని కథనాలు వెలువడ్డాయి. విడిపోయి రెండేళ్లు అవుతుండగా షణ్ముఖ్-దీప్తి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఒకరిని మరొకరు రెచ్చగొట్టే, కవ్వించే పోస్ట్స్ పెడుతుంటారు. తాజాగా దీప్తి బెడ్ పై హాట్ గా ఉన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెట్టింది. ఈ ఫోటోలు తనకు దూరమైన షణ్ముఖ్ ని రెచ్చగొట్టేందుకే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.