Homeఎంటర్టైన్మెంట్Honey Rose: అప్పుడు బాలయ్య.. ఇప్పుడు చిరంజీవి.. హనీ రోజ్ పంట పండినట్టేనా?

Honey Rose: అప్పుడు బాలయ్య.. ఇప్పుడు చిరంజీవి.. హనీ రోజ్ పంట పండినట్టేనా?

Honey Rose: బాలయ్య సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఆ సినిమాలో కొత్త హీరోయిన్ ను తీసుకున్న, పాత హీరోయిన్ ఉన్నా కూడా వారి క్రేజ్ మామూలుగా ఉండదు. కొత్త హీరోయిన్ అయితే కచ్చితంగా ఫేమస్ అవుతుంటుంది. అదే విధంగా రీసెంట్ గా వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. అందులో నటించిన హనీ రోజ్ కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించింది.అంతేకాదు ఒక్కసారిగా ఈ అమ్మడు క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. డ్యూయల్ రోల్ లో నటించి బాలయ్య మెప్పించారు. ఇందులో నటించి మలయాళ బ్యూటీ హనీ కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయం అయినా హనీ మరో తెలుగు సినిమాలో నటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ఫాలోయింగ్ సంపాదిస్తూ ఎప్పుడు యాక్టివ్ గా ఉండేది. ఇప్పటికీ కూడా నిత్యం షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తో బిజీ బిజీ గడిపేస్తుంటుంది హనీరోజ్.

హనీ రోజ్ నటించిన సినిమాలు కొన్నే అయినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఫుల్ గా ఉంది. ఈ అమ్మడుకు ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 4 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే హనీ ఓ టాలీవుడ్ సినిమాలో నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మరోసారి కూడా సీనియర్ హీరోతోనే జతకట్టనుందని తెలుస్తోంది. అంటే గతంలో బాలయ్యతో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం చిరంజీవితో నటించడానికి సిద్దమైందన్నమాట. ఇక చిరంజీవి నటిస్తున్న న్యూ సినిమా విశ్వంభర.

విశ్వంభర సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. విశిష్ట చిరంజీవి సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించబోతున్నారట. ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొత్తం మీద మంచి అంచనాల నడుమ రాబోతున్న ఈ చిరు సినిమాలో హనీ రోజ్ ఛాన్స్ కొట్టేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజంగానే హనీ ఈ సినిమాలో నటించబోతుందా లేదా అనేది తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Oktelugu Epaper
Exit mobile version