Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఈయన సినిమా వస్తుందంటే థియేటర్ల ముందు క్యూ కడతారు నెటిజన్లు. ఇక అభిమానులు చేసే హడావిడి మామూలుగా ఉండదు. ప్రస్తుతం పుష్ 2 సినిమా తో బిజీ ఉన్నారు బన్నీ. బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిత్తూరు యాసలో వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావడానికి సిద్ధమైంది.
అయితే ప్రస్తుతం పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తారు? ఆయన చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయని సెర్చ్ చేస్తున్నారు బన్నీ అభిమానులు. ప్రస్తుతం పుష్ప సినిమాతోనే బిజీగా ఉన్నారు బన్నీ. ఈ సినిమా విడుదల తర్వాత కూడా కొన్ని రోజులు బిజీగానే ఉంటారని టాక్. హిట్ అయితే సినిమా సక్సెస్ మీట్ లు కూడా ఉంటాయి. అలా ఇంకా కొన్ని రోజులు బన్నీ బిజీగానే ఉంటారు అని టాక్. అయితే పుష్ప సినిమా తో ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించి జాతీయ అవార్డును అందుకున్నారు.
పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారట. ఇప్పటికే అల్లు అర్జున్ కు కథ కూడా చెప్పారట. ఇక వీరిద్దరు కలిసి గతంలోనే సరైనోడు సినిమాకు కలిసి పని చేశారు. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవలే బోయపాటితో సినిమా చేస్తున్నట్టు అల్లు అరవింద్ కన్మర్మ్ చేశారు. కానీ హీరో ఎవరన్నది ప్రకటించలేదు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నాడు. కానీ ఈ సినిమా ఇప్పట్లో మొదలవ్వదని టాక్. అంతేకాదు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కూడా అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అట్లీ దర్శకత్వం వహించబోయే మొదటి తెలుగు సినిమా ఇదే. అంటే బన్నీ చేతిలో మూడు మంచి సినిమాలే ఉన్నాయన్నమాట. మరి ఈయన ఎవరితో ముందు సినిమా చేస్తారో చూడాలి.