https://oktelugu.com/

Actress Shaheen Doherty’s Death : సంచలనం రేపుతున్న ’బ్లెవరీ హిల్స్‘ నటి షాహెన్ డోహెర్టీ మృతి.. కారణం ఏంటో తెలుసా..?

గత కొన్నేండ్లుగా షాహెన్ డోహెర్టీ అనారోగ్యంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. 2015లో మొదటిసారిగా ఆమె అనారోగ్యం ప్రపంచానికి తెలిసింది. మాస్టెక్టమీ చేయించుకున్న తర్వాత తన అనారోగ్య సమస్యపై తొలిసారిగా షాహెన్ తన అభిమానులతో పంచుకుంది. డిసెంబర్ 2016లో ఆమె మొదటిసారిగా తాను చేయించుకున్న రేడియేషన్ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చికిత్స తనకు అతి భయంకరంగా అనిపించిందని ఆమె పోస్టులో పేర్కొన్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 15, 2024 / 04:36 PM IST

    Actress Shaheen Doherty's Death

    Follow us on

    Actress Shaheen Doherty’s Death : ప్రముఖ అమెరికన్ నటి, నిర్మాత షాహెన్ డోహెర్టీ శనివారం మృతి చెందింది. ప్రస్తుతం ఆమె వయస్సు 53 ఏండ్లు కాగా, రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతూ ఆమె మరణించింది. తన ప్రచారకర్త లెస్లీస్లోన్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తన కుటుంబసభ్యులకు ఇది విషాదకర సమయమని, వారికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. ఈ వార్తను పీపుల్ మ్యాగజైన్ తొలుత ప్రచురించడంతో వెలుగులోకి వచ్చింది. ’బ్లేవరి హిల్స్ 90210‘ ద్వారా ఆమె విశేష అభిమానాన్ని చూరగొన్నది. హైస్కూల్ డ్రామా సిరీస్ గా ఇది ఆకట్టుకుంది. రొమ్ము క్యాన్సర్ తో సుదీర్ఘ పోరాటం తర్వాత ఆమె తుది శ్వాస విడిచింది. ఆమె మృతదేహం వద్ద కుమార్తె, సోదరి, అత్తతో పాటు స్నేహితులు, ఆమె పెంపుడు కుక్క బ్రౌనీ ఉన్నారు. వారి గోప్యతకు భంగం కలిగించవద్దని లెస్టీ స్లోన్ కోరింది.

    కొన్నేళ్లుగా చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు..
    గత కొన్నేండ్లుగా షాహెన్ డోహెర్టీ అనారోగ్యంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. 2015లో మొదటిసారిగా ఆమె అనారోగ్యం ప్రపంచానికి తెలిసింది. మాస్టెక్టమీ చేయించుకున్న తర్వాత తన అనారోగ్య సమస్యపై తొలిసారిగా షాహెన్ తన అభిమానులతో పంచుకుంది. డిసెంబర్ 2016లో ఆమె మొదటిసారిగా తాను చేయించుకున్న రేడియేషన్ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చికిత్స తనకు అతి భయంకరంగా అనిపించిందని ఆమె పోస్టులో పేర్కొన్నారు.

    ఇక తనకు క్యాన్సర్ తిరిగి వచ్చిందని, ప్రస్తుతం నాలుగో దశలో ఉన్నట్లు ఆమె ఫిబ్రవరి 2020లో బహిరంగంగా వెల్లడించారు. రొమ్ము క్యాన్సర్ పై బహిరంగంగా కొంతకాలంగా ఆమె చర్చ మొదలుపెట్టింది. ఇందుకోసం న్యాయవాదిగా కూడా మారింది. కోర్టులో ఉన్న ఓ కేసు విషయంలో తన అనారోగ్య సమస్యలు బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమె ముందుగానే ఈ వివరాలను వెల్లడించింది. 2018లో ఆమె ఇంటిలో జరిగిన ఓ అగ్ని ప్రమాద ఘటనపై ఆమె నటుడు స్టేట్ ఫార్మ్ పై దావా వేశారు.

    చిన్నతనంలోనే నటిగా గుర్తింపు..
    తన ఏడేళ్ల వయస్సులో షాహెన్ లాస్ ఏంజెల్స్ కు వెళ్లింది. వారిది తొలుత మెంఫిస్, టేనస్సీ. ఆమె ఏప్రిల్ 12, 1971న జన్మించింది. తల్లి రోసా బ్యూటీ సెలూన్ నిర్వహించగా, తండ్రి టామ్లా డోహెర్టీ తనఖా సలహాదారుగా పని చేశారు. ఇక లాస్ ఏంజెల్స్ లోనే ఆమె నటనారంగంలోకి అడుగు పెట్టింది. పదకొండేళ్ల వయస్సులో బాలనటిగా ఆమె అలరించింది. జెన్నీ వెల్డర్ గా ఆమె నటించిన లిటిల్ హౌస్ ఆన్ ది ఫ్రైరీ ఎంతో ఆకట్టుకుంది. ఇక యుక్త వయస్సులో ఆమె నటించిన గర్ల్స్ జస్ట్ వాంట్ టు హావ్ ఫన్ విశేషంగా అలరించింది. షాహెన్ డోహెర్టీ నటించిన బ్లేవరీ హిల్స్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 2020 వరకు ప్రసారమైన ఈ నాలుగో సీజన్ లో ఆమె షోను వదిలివెళ్లింది.

    అలుముకున్న వివాదాలు..
    అయితే గతంలో ఆమెను ఎన్నో వివాదాలు అలుముకున్నాయి. ఆమె విందులకు ఎక్కువ హాజరయ్యేదని, షూటింగ్ లకు ఆలస్యంగా హాజరయ్యేదని పేర్కొంది. ఆమె మూడుసార్లు వివాహం చేసుకున్నారు. చివరన ఫేమస్ ఫొటోగ్రాఫర్ కార్డ్ ఈశ్వరియంకోతో గతేడాది విడాకుల కోసం న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకుంది. ఇక సొంతంగా రియాల్టీ ప్రోగ్రామ్ బ్రేకింగ్ ఆఫ్ విత్ షాహెన్ డోహెట్రీని ప్రారంభించింది, రెండు మ్యూజిక్ చిత్రాలకు దర్శకురాలిగా పనిచేసింది. ఇక 53 ఏండ్ల వయస్సులో రొమ్ము క్యాన్సర్ తో షాహెన్ మృతి చెందింది.