Home Loan : సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ సరైన బడ్జెట్ లేకపోవడంతో బ్యాంకు నుంచి రుణం తీసుకొని తమ కలను నెరవేర్చుకుంటారు. అయితే గృహ రుణం తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ తీర్చే టప్పుడు ఎంతకీ తీరదు. హోమ్ లోన్ పీరియడ్ఎంత ఎక్కువ కాలం ఏర్పాుట చేసుకుంటే అంత ఎక్కువగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అయితే మహిళల పేరుమీద లోన్ తీసుకుంటే లక్షల రూపాయలు మిగిలే ట్రిక్ ఉంది. అదేంటో తెలుసుకోండి..
హోమ్ లోను తీసుకున్న వారు ఎక్కువ కాలం టెన్యూర్ పెట్టుకుంటే అసలు కంటే వడ్డీనే ఎక్కువగా కట్టేస్తారు. అందువల్ల లోన్ కోసం నిర్ణయించుకున్న ఈ ఎంఐని పెంచుకుంటూ పోవడం వల్ల త్వరగా లోన్ తీరుస్తారు. అయితే కొన్ని బ్యాంకులు ఇలాంటి అవకాశం ఇవ్వవు. అంతేకాకుండా వివిధ మార్గాల నుంచి పెద్ద మొత్తంలో నగదు వచ్చినప్పుుడు ప్రీక్లోజ్ చేయాలనుకుంటారు. కానీ ప్రీ క్లోజ్ చార్జీలు వర్తిస్తాయి. అయితే మహిళల పేరు మీద లోన్ తీసుకుంటే ఈ సమస్య ఉండదు. ఎలాగంటే?
ఉదాహరణకు హరిణి అనే మహిళ రూ.10 లక్షల హోం లోన్ ను 20 సంవత్సరాలకు కాల పరిమితితో తీసుకున్నారు. ఈ మొత్తానికి ఈఎంఐ నెలకు రూ.9,650 అవుతుంది. ఇందులో అసలు రూ.1,317 కాగా.. వడ్డీ రూ.8,333తో చెల్లిస్తారు. అయితే ఇలాచెల్లిచడం ద్వారా 20 సంవత్సరాలకు భారం పెరిగిపోతుంది. పైగా మధ్యలో ఇతర ఖర్చులు రావడం వల్ల ఈఎంఐని చెల్లించలేకపోతారు. అయితే నెలనెలా ఈఎంఐని పెంచుకుంటూ పోవడం వల్ల లోన్ ను త్వరగా పూర్తి చేయగలుగుతారు.
అయతే మహిళలు రుణం తీసుకునే సమయంలో జీవిత భాగస్వామితో లేదా బంధువుల్లో మరో కుటుంబ సభ్యులతో కలిసి దరఖాస్తు చేసుకోవాలి. దీంతో వీరు ‘లోన్ టూ వాల్యూ’(ఎన్టీవీ)కి అర్హులవుతారు. దీని ప్రకారం మహిళలకు తక్కువ ఈఎంఐతో పాటు తక్కువ వడ్డీ పడే అవకాశం ఉంటుంది. ఇలా ఈఎంఐ తక్కువగా ఉన్న సమయంలో ప్రతినెలా రూ.1000 అదనంగా చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీరికి ఎలాంటి ప్రీ క్లోజింగ్ చార్జీలు ఉండవు. దీంతో 20 సంవత్సరాల్లో తీర్చాల్సిన అప్పులు 184 నెలల్లోనే పూర్తి చేస్తారు. దీంతో రూ.3.58 లక్షలు మిగులుతాయి.