Site icon OkTelugu

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాల రిలీజ్ మీద క్లారిటీ వచ్చేది అప్పుడేనా..?

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తమ సత్తాని చాటుకుంది. ఇక అందులో భాగంగానే జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కూడా సాగిస్తూనే మంత్రిగా పలు శాఖలకు తన సేవలను అందించబోతున్నాడు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 5 సంవత్సరాల్లో తన రాజకీయ మార్కు ను చూపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లకు ఎప్పుడు వస్తాడు అనే దానిమీద ప్రస్తుతం చాలా వరకు చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే సెప్టెంబర్ 27వ తేదీన ఓజి సినిమాని రిలీజ్ చేస్తామంటూ ప్రొడ్యూసర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయినప్పటికీ ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ పోన్ అయినట్టుగా తెలుస్తుంది. మరి దీన్ని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ సెట్స్ మీద ఉంచిన మూడు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే దాని మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.

ఇక మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు, అటు రాజకీయాలు రెండింటిని ఏకకాలంలో చేసుకుంటూ ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగా రాజకీయంలో ప్రస్తుతానికైతే సక్సెస్ ని సాధించాడు మరి తను ఎంతవరకు ప్రజలకు సేవ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక అందులో భాగం గానే సినిమాల్లో వచ్చే డబ్బులను రాజకీయ రంగంకి వాడుకుంటున్నాడు. కాబట్టి సినిమాలను కూడా ఆయన వదిలిపెట్టే ప్రసక్తేతే కనిపించడం లేదు.

మరి ఈ రెండింటిని కొనసాగిస్తూ ఆయన ముందుకు కదులుతూ ఉంటే ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతాడు అని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతానికైతే తను సెట్స్ మీద ఉంచిన ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర విరమల్లు మూడు సినిమాలను కూడా తొందర్లోనే ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటాడు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు…

Exit mobile version