https://oktelugu.com/

HMPV virus : ఓ వైపు HMPV వైరస్.. మరోవైపు జంతువుల్లో బర్డ్ ఫ్లూ.. రోగాలు ముసురుతున్నాయా! రెడ్ అలర్ట్ జారీ..

ఇప్పటికే చైనాలో HMPV వైరస్ విలయతాండవం చేస్తోంది. ఎన్ని మరణాలు నమోదయ్యాయో తెలియదు కాని.. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.. అందువల్లే ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. చైనా నుంచి వచ్చే వారిని నిశితంగా గమనిస్తున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 5, 2025 / 09:23 PM IST

    HMPV virusa and bird flu

    Follow us on

    HMPV virus : HMPV వైరస్ వల్ల చైనాలో అల్లకల్లోలం నెలకొంది.. ఇప్పటికే చాలామంది ఆసుపత్రుల పాలయ్యారు. కొన్ని ప్రాంతాలలో పడకలు సరిపోక.. రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన జలుబు, తలనొప్పి, అలసట, జ్వరం వంటివి రోగులలో కనిపిస్తున్న లక్షణాలు. ఇంచుమించు కరోనా వచ్చినప్పుడు కూడా ఇలాంటి లక్షణాలే రోగులలో కనిపించాయి. పైగా హెచ్ఎంపీవీ వైరస్ వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.. ఈ వైరస్ వల్ల మనుషుల్లో ఆరోగ్యపరంగానూ మార్పులు వస్తాయని వివరిస్తున్నాయి.. అయితే ఈ వైరస్ నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది, తమ దేశంలో ఎలాంటి పరిస్థితి ఉన్నదనే విషయంపై చైనా ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు కాబట్టి.. ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. వైరస్ అనుమానిత కేసులు ఏమైనా ఉంటే.. అప్రమత్తంగా ఉండాలని.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సూచించింది. ఎప్పటికప్పుడు కేంద్రం అందించే సూచనలను పరిశీలించాలని.. తమ అవసరాలకు అనుగుణంగా వాటిని అమలు చేయాలని వివరించింది.

    బర్డ్ ఫ్లూ వచ్చేసింది..

    HMPV వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న జనాలకు.. బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. మనదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ ప్రాంతంలోని గోరెవాడ రెస్క్యూ సెంటర్లో మూడు పులులు బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయాయి. ఇందులో ఒక చిరుత కూడా ఉంది. డిసెంబర్ 20, 23 తేదీలలో పులులు చనిపోయాయి. అయితే వీటిని పరీక్షించిన తర్వాత వచ్చిన నమూనాలలో బర్డ్ ఫ్లూ ఉన్నట్టు తేలింది.. పులులకు పచ్చి మాంసం తినడం ద్వారా బర్డ్ ఫ్లూ వచ్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే మిగతా జంతువులకు పరీక్షలు నిర్వహించగా వాటిల్లో నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. జంతువులు మృతి చెందడంతో జూ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ” ఇక్కడ జూలో పులులు కొన్ని అనారోగ్యంగా కనిపించాయి. అందులో మూడు పులులు, ఒక చిరుత కన్నుమూశాయి. వాటికి చికిత్స అందిస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పులులకు ఇతర ప్రాంతాల నుంచి మాంసం తెప్పిస్తుంటాం. బహుశా అందువల్ల వాటికి బర్డ్ ఫ్లూ వచ్చి ఉంటుంది. అయితే మిగతా జంతువులకు పరీక్షలు నిర్వహిస్తే అవి ఆరోగ్యంగా ఉన్నాయి. మూడు పులులు, ఒక చిరుత పులి చనిపోయిన నేపథ్యంలో జంతుప్రదర్శనశాలలో రెడ్ అలర్టు ప్రకటించామని” జూ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైతే పరిస్థితి అదుపులో ఉందని.. ఎప్పటికప్పుడు జంతువులను స్వయంగా పర్యవేక్షిస్తున్నామని వారు పేర్కొంటున్నారు.